ఆమెని అక్కా అనాలంటే కంపరంగా ఉంది : ఏవీ జస్వంతి !

Sat Jun 06 2020 14:40:23 GMT+0530 (IST)

Akhila Priya Vs Janwanthi

ఆళ్లగడ్డలో భూమా ఏవీ కుటుంబాల మధ్య రాజకీయం వైర్యం రోజురోజుకి ముదురుతోంది. మాజీ మంత్రి అఖిలప్రియ టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఇలాంటి తరుణంలో తాజాగా ఆళ్ళగడ్డలో అఖిలప్రియపై పోటీకి సిద్ధమని టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తనయురాలు జస్వంతి ప్రకటించి సంచలనం సృష్టించారు. తమది ఆళ్ళగడ్డనే అని అక్కడే రాజకీయం చేస్తామని తెలిపారు. దీనిపై ఆమె మాట్లాడుతూ ..దీన్ని స్వాగతించటానికి అఖిలప్రియ ఎవరు? అఖిలప్రియను అక్కా అని పిలవాలంటే అసహ్యం వేస్తోందన్నారు.దేవుడిచ్చిన మామను దేవుడి దగ్గరకు పంపాలని అఖిలప్రియ కుట్ర చేసిందని అఖిలప్రియ పై సంచలన ఆరోపణలు చేసింది.  తండ్రి లేని అఖిలప్రియకు తండ్రి విలువ తెలియదనుకోనని ఆడపిల్లగా నాన్న లేని  పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉందన్నారు. కష్ట పడకుండా మంత్రి అయిన అఖిలప్రియకు కష్టం విలువ తెలియదన్నారు.  భూమా దంపతులు ఏవీ సుబ్బారెడ్డి 30ఏళ్ళ కష్టం వలనే అఖిలప్రియకు ఆ స్థాయి దక్కిందన్నారు. ఆమెది క్రిమినల్ మైండ్ అని అఖిలప్రియ తీరు మహిళలకే సిగ్గుచేటన్నారు.  తన తండ్రి ప్రాణం ఖరీదు రూ.50లక్షలా అంటూ ప్రశ్నించింది.

ఈ కుటుంబాల మధ్య సంధి కుదర్చడానికి పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చావడానికి అయిన సిద్దమే కానీ అఖిలప్రియతో మాత్రం రాజీపడనని టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. టీడీపీ నాయకత్వం చెప్పినా కూడా మళ్లీ అఖిల ప్రియతో మాత్రం కలిసి పనిచేయనని తేల్చిచెప్పారు. నాకు భయం లేదు... నన్ను నేను కాపాడుకోగలను. 35 ఏళ్లుగా ఫ్యాక్షన్ ఫీల్డ్ లో ఉన్నా. అఖిలప్రియ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాక్షన్ ను వదిలేశాను కాబట్టే ఒంటరిగా తిరుగుతున్నా. ఆళ్లగడ్డలో తప్పకుండా రాజకీయం చేస్తానని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.