Begin typing your search above and press return to search.

మర్కజ్ వివాదం.. అజిత్ దోవల్ ఎంట్రీ!

By:  Tupaki Desk   |   1 April 2020 4:30 PM GMT
మర్కజ్ వివాదం.. అజిత్ దోవల్ ఎంట్రీ!
X
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కేంద్రంగా మత ప్రార్థనలు జరగడం.. దాని వల్ల దేశంలో చాలా మందికి కరోనా వైరస్ వ్యాపించడంతో కేంద్రం అలెర్ట్ అయ్యింది. ఇక్కడ ముస్లింలను ఆసుపత్రులకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ముస్లింలు ఆస్పత్రికి వెళ్లడానికి ససేమిరా అనడం తో పీఠముడి నెలకొంది. ఇది పెద్ద వివాదం కానుడడంతో ఈ సున్నిత సమస్యపై ప్రభుత్వం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను రంగంలోకి దించింది.

మర్కజ్ మసీదులోని వ్యక్తులను క్వారంటైన్ తరలించడానికి మత పెద్దలు ఒప్పుకోలేదు.తబ్లిగ్ జమాత్ నేత మౌలానా సాద్ సైతం నిరాకరించారు. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను రంగంలోకి దించారు.

విదేశీయులతో పాటు స్థానిక ముస్లింలు మర్కజ్ మసీదులో ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించేందుకు అజిద్ దోవల్ ముస్లిం ఉలేమాలతో చర్చించి ఒప్పించారు. మసీదులోని వారందరికీ కరోనా పరీక్షలు చేయించి మసీదును శుభ్రపరిచారు. మర్కజ్ నుంచి అందరినీ ఖాళీ చేయించారు.

మర్కజ్ లో 216మంది విదేశీయులన్నట్టు గుర్తించారు. దీంతోపాటు పలు మసీదుల్లో 800మంది ఇతర దేశాల మతస్థులున్నారని వారికి వైద్య పరీక్షలు చేయడానికి రెడీ అయ్యారు. మొత్తానికి అజిత్ దోవల్ సున్నితమైన ఈ ప్రాంతంలో పర్యటించి ముస్లిం మతపెద్దలను ఒప్పించి మెప్పించడం తో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.