అయోధ్య ఎయిర్ పోర్టు పేరు మార్పు ఏం పెట్టారో తెలుసా?

Wed Nov 25 2020 23:30:35 GMT+0530 (IST)

Airport in Ayodhya to be named Maryada Purushottam Sri Ram

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందుత్వ పేర్ల ఒరవడి పెరిగిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అయోధ్య రాముడు కొలువైన చోట కూడా ఎయిర్ పోర్టు పేరు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఉత్తరప్రదేశ్ లో కొలువైన బీజేపీ ప్రభుత్వం తాజాగా అక్కడి ‘అయోధ్య ఎయిర్ పోర్టు’ పేరు మార్చాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే కేబినెట్ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి విమానయాన శాఖకు లేఖ పంపించింది.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం కావడంతో యూపీలోని యోగి సర్కార్ ఏకంగా ఎయిర్ పోర్టుకు ఎయిర్ పోర్టుకు ‘శ్రీరాముడి’ పేరు కలిసి వచ్చేలా నామకరణం చేయాలని సిద్ధమయ్యారు.

యూపీలోని అయోధ్య ఎయిర్ పోర్టుకు ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ విమానాశ్రయం’ పేరు పెట్టాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ప్రభుత్వం విమానయాన శాఖ ఆమోదిస్తే ఈ కొత్త పేరు వాడుకలోకి రానుంది.