Begin typing your search above and press return to search.

ఆఫ్టర్ కరోనా: విమాన ప్రయాణమే మారిపోయిందిలా..!

By:  Tupaki Desk   |   25 May 2020 2:18 PM GMT
ఆఫ్టర్ కరోనా: విమాన ప్రయాణమే మారిపోయిందిలా..!
X
60 రోజుల లాక్ డౌన్ తరువాత దేశీయ విమానాలు ఈరోజు భారతదేశం అంతటా పున: ప్రారంభమయ్యాయి. సేవలను ప్రారంభించాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఏకంగా 25000 కోట్ల ఆదాయాన్ని నష్టపోయింది. ఇప్పుడు విమానాలు ప్రారంభంతో ఊపిరిపీల్చుకుంది.

భారతదేశంలోని అన్ని దేశీయ ఎయిర్ పోర్టులలో భారీ సంఖ్యలో ప్రజలు విమానాల్లో ఎక్కారు. అయితే మునుపటితో పోలిస్తే స్పష్టమైన మార్పు ఈసారి కనిపించాయి. బోర్డింగ్ - విమానాల్లో సిబ్బంది మొత్తం కరోనా ఆస్పత్రుల్లో ఉండే వైద్యుల వలే మొత్తం పీపీఈ కిట్స్ - చేతికి గ్లౌజులు - మూతికి మాస్కులతో కనిపించారు. ఎయిర్ హోస్టెస్ తో అందంగా ఉండే విమానాల లోపల ఇప్పుడు వారంతా రక్షణ కిట్స్ తో కనిపించేసరికి విమాన ప్రయాణం పూర్తిగా కళతప్పింది.

ప్రస్తుతం విమానాశ్రయాలు - విమానంలో ప్రయాణానికి వెళుతుంటే ఐసీయూలోకి వెళుతున్న ఫీలింగ్ ప్రయాణికులకు కలుగుతోంది. అయితే ప్రయాణికులకు ఈ కొత్త అవతరాలు భయాన్ని కలిగిస్తున్నాయి.

విమాన ప్రయాణంలో ఈసారి అత్యంత పరిశుభ్రత - శానిటైజేషన్ - వైరస్ వ్యాపించకుండా సిబ్బంది మాస్కులు - గాగుల్స్ - చేతి గ్లౌజులతో కట్టుదిట్టంగా కనిపిస్తున్నారు. తల నుంచి కాలి వరకు అందరూ పీపీఈ సూట్స్ ధరించి కనిపించారు. ప్రయాణికులు - విమాన ఎయిర్ హోస్టెస్ సిబ్బంది - కూడా ఇలానే కనిపించడం విమాన ప్రయాణాన్ని బీతావాహంగా మార్చేసింది.

టేకాఫ్‌కు ముందు.. వచ్చిన తర్వాత ప్రయాణికులను థర్మల్ టెంపరేచర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. తద్వారా ఏదైనా సహోద్యోగులు లేదా ప్రయాణీకులు లక్షణాలు / టెస్ట్ పాజిటివ్ చూపిస్తే - క్యాబిన్ సిబ్బందిని కూడా నిర్బంధించి పరీక్షించబడతారు.

అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా కొన్ని దేశాలు ప్రారంభించాయి. ఖతార్ ఎయిర్‌ వేస్ - ఎయిర్‌ ఏషియా - ఫిలిప్పీన్ ఎయిర్‌ లైన్స్ గత నెలలో క్యాబిన్ సిబ్బంది కోసం పూర్తి-బాడీ కస్టమ్ పిపిఇ సూట్లను ప్రవేశపెట్టాయి.

టేబుల్ సెటప్‌ కు బదులుగా ట్రే ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. క్యాబిన్ సిబ్బంది మరియు ప్రయాణీకుల ఉపయోగం కోసం హ్యాండ్ శానిటైజర్ ఉంచారు. ఇలా మొత్తం విమాన ప్రయాణమే ఆఫ్టర్ మహమ్మారి తర్వాత మారిపోయింది.