Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఎయిర్ ఏషియా విమానానికి తప్పిన పెను ముప్పు !

By:  Tupaki Desk   |   26 May 2020 1:00 PM GMT
బ్రేకింగ్ : ఎయిర్ ఏషియా విమానానికి తప్పిన పెను ముప్పు !
X
ఎయిర్ ఏషియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఏ-320 ఎయిర్‌ ఏషియా విమానం జైపూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలోని ఒక ఇంజిన్‌ లో ఫ్యుయిల్‌ లీక్ అవుతున్నట్టు గుర్తించిన పైలట్, అలర్ట్ అయిన పైలట్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో, ల్యాండింగ్‌కు అధికారులు లైన్ క్లియర్ చేసారు.

దీనితో ఒకే ఇంజన్ తోనే ఫైలెట్ విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్ చేసాడు. దీనితో భారీ ప్రమాదం తప్పింది..ఈ విమానంలో 76 మంది ప్రయాణికులు ఉన్నారు. భారీ ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ ఘటన పై స్పందించిన ఎయిర్‌ ఏషియా.. ప్రయాణికుల సేఫ్టీకే తమ ఫస్ట్ ప్రియార్టీ అని, మా అతిథులు మరియు సిబ్బంది యొక్క భద్రత మా కార్యకలాపాల యొక్క ప్రతి అంశంలో అతి ముఖ్యమైనది అని, మా పైలట్లు మరియు సిబ్బంది అనుభవజ్ఞులైన మరియు బాగా శిక్షణ పొందినవారని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరిన ఎయిర్ ఏషియా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చుతామని ప్రకటించింది.

కాగా ,కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలలుగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. రెండు, మూడు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అయితే విమాన ప్రయాణాలు ప్రారంభమైన రెండో రోజే ఈ ఘటన జరగడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.