బీజేపీలో చేరిన కత్తికార్తీక

Sat Nov 21 2020 23:00:56 GMT+0530 (IST)

Breaking: Kathi Karthika who joined BJP

దుబ్బాకలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి అదృష్టం పరీక్షించుకున్న బిగ్ బాస్ ఫేమ్ టీవీ యాంకర్ కత్తి కార్తీక అనూహ్యంగా బీజేపీలో చేరారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా అదృష్టం పరీక్షించుకుంటూ పోటీచేస్తున్న ఆమె తాజాగా కాషాయ కండువా కప్పుకోవడం విశేషం.తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో కత్తి కార్తీక సమావేశమయ్యారు. చర్చల అనంతరం పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు తన ఫేస్ బుక్ పేజీలో కత్తి కర్తీక కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఫొటోను షేర్ చేశారు. మర్యాదపూర్వకంగా కలిశానని.. రెండు మూడు రోజుల్లోనే పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.

కాగా ఇటీవలే కత్తి కార్తీక దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ పోటీచేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి తలపడ్డారు.. ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. పలు కేసులు ఎదుర్కొని వివాదాస్పదమయ్యారు. బీజేపీలో టికెట్ కన్ఫం అయితే చేరేందుకు రెడీగా ఉన్నట్టు తెలిసింది.