Begin typing your search above and press return to search.

టాటా.. వీడుకోలూ...బీజేపీకి హైబీపీ...?

By:  Tupaki Desk   |   13 Jan 2022 2:11 PM GMT
టాటా.. వీడుకోలూ...బీజేపీకి హైబీపీ...?
X
కలసి వచ్చే కాలానికి అన్నీ శుభ శకునాలే ఎదురవుతాయి. ఇక ఇబ్బందులు వస్తున్నాయంటే కచ్చితంగా ఆ మార్క్ చెడు సంకేతాలు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం యూపీ బీజేపీకి అదే జరుగుతోంది. 325 మంది ఎమ్మెల్యేలు, నాలుగింట మూడొంతుల మెజారిటీ. 2019లోనూ అప్రతిహత విజయాలు. ఇలా కులసాగా సాగుతున్న కమలం పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ప్రకటంతోనే గట్టి షాకులు తగులుతున్నాయి.

వారూ వీరూ అంతా కలసి టాటా వీడుకోలూ అంటున్నారు. అయిదేళ్ల పాటు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు మాకొద్దీ కాషాయం అని తీసి అలా పక్కన పడేస్తున్నారు. వెళ్ళిపోతున్న వారు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేమి ప్రభుత్వమని తూలనాడుతున్నారు. అంటే వారికి తెలిసిపోయినట్లుంది తామున్నది మునిగే నావ అని. అందుకే సేఫ్ జోన్ ని వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు.

అలా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పదమూడు మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు పార్టీని వీడడం అంటే నిజంగా బీజేపీకి హై బీపీని పెంచే పరిణామమే అంటున్నారు. యోగీ ఆధిత్య నాథ్ కేబినెట్‌లోని మంత్రిగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్యతో ప్రారంభమైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మూడవ మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీకి రాజీనామా చేశారు.

ఈ రాజీనామా స్కోర్ కనీసంగా 20ని దాటి ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ప్రతీ రోజూ యోగీ మంత్రి వర్గం నుంచి ఒకరిద్దరు మంత్రులు రాజీనామా చేసి బయటకు వచ్చేస్తారుట. ఇక భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్, స్వామి ప్రసాద్ మౌర్య తక్కువ స్థాయి నేతలు కారు. వీరు బహుజనులకు నేతలు. అంతే కాదు, గట్టి పట్టున్న నాయకులు. దళితులు, వెనుకబడిన వారు, రైతులు, నిరుద్యోగ యువత, చిరువ్యాపారులను ఏ మాత్రం పట్టించుకోలేదని బయటకు వచ్చిన వారంతా ఆరోపిస్తున్నారు.

అసలే బీజేపీకి అగ్రవర్ణ పార్టీ అన్న పేరుంది. అయితే 2017లో చేసిన ఓబీసీ ప్రయోగం వల్ల ఆ పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. ఇపుడు చూస్తే వారు బీజేపీ తమను పట్టించుకోలేదని అంటున్నారు. మరో వైపు ఠాకూర్లు, బ్రాహ్మణులు కూడా బీజేపీకి దూరం జరిగారు. ఒక్క మాటలో చెపాలీ అంటే బీజేపీకి ఉన్నది, ఉంచుకున్నదీ రెండూ పోతున్నాయనే అంటున్నారు.

దీని మీద సీనియర్ రాజకీయ నాయకుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ మాట్లాడుతూ యూపీలో బీజేపీకి పూర్తిగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. బీకేపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బయటకు వస్తారని కూడా ఆయన జోస్యం చెబుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇలా బయటకు వచ్చిన వారు అంతా ఎస్పీలో చేరడం. దాంతో రాజకీయంగా రోజురోజుకీ ఎస్పీ బాగా బలపడుతోంది. ముఖా ముఖీ పోరుకు యూపీ రాజకీయ వాతావరణం వేదిక అవుతోంది. దాంతో ఈజీగా బీజేపీ కంచు కోటలను కూల్చేస్తామని ఎస్పీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. యూపీ షాక్ బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కూడా కలవరపెట్టేలా ఉందనే అంటున్నారు.