Begin typing your search above and press return to search.

అదానీపై మ‌ళ్లీ అదే మాట‌.. దేశానికి సంబంధం లేద‌ట‌!

By:  Tupaki Desk   |   6 Feb 2023 5:13 PM GMT
అదానీపై మ‌ళ్లీ అదే మాట‌.. దేశానికి సంబంధం లేద‌ట‌!
X
అదానీ. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. అంతేకాదు, ఆయ‌న చేసిన నిర్వాకంతో దేశ సంప‌ద కూడా ఆవిర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌ను మిన్నంటాయి. ఎస్‌బీఐ, ఎల్ ఐసీ వంటి స‌మ‌స్థ‌లు కూడా ఇప్ప‌టికే వేల కోట్ల రూపాయ‌ల‌ను న‌ష్ట‌పోయాయి. మ‌రి ఇంత జ‌రుగుతుంటే.. కేంద్రం మాత్రం అదేమీ లేదు.. ఆ విష‌యాన్ని తాము ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తోంది.

వాస్త‌వానికి స‌త్యం రామ‌లింగ‌రాజు చేసిన వ్య‌వ‌హారం మాదిరిగానే అదానీ కూడా వ్య‌వ‌హ‌రించార‌ని.. మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అప్ప‌టి ఘ‌ట‌న‌లో వెంట‌నే జోక్యం చేసుకున్న ఈడీ, సీబీఐ.. లు కేసు న‌మోదు చేసి రాజును జైలుకు పంపించాయి. మ‌రి ఇప్ప‌టి ఘ‌ట‌నను అస‌లు స‌ర్కారుకు ముడి పెట్టాల్సిన అస‌వ‌రం లేద‌ని.. అది పూర్తిగా అదానీ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మ‌ని తేల్చేయ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఏం జ‌రిగిందంటే..

అదానీ గ్రూప్ షేర్ల పతనం కేవ‌లం ఆ కంపెనీ సమస్యగానే చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెల‌విచ్చారు. అంతేకాదు.. ఇది దేశ ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా పరిగణించకూడదని సుద్దులు చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌లో అప్పుడప్పుడూ ఒడుదొడుకులు సహజంగానే వస్తుంటాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

కానీ, హిండెన్‌బ‌ర్గ్ చేసిన 78 ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన అదానీ కంపెనీ.. వెంట‌నే దీనిని దేశ స‌మ‌స్య‌గా చిత్రీక‌రించింది. దేశ స‌మైక్య‌త‌ను, ప్ర‌ధానంగా పీఎం న‌రేంద్ర‌మోడీ పేరును బ‌ద్నాం చేసే ఉద్దేశం ఉంద ని పేర్కొంది.

కానీ, ప్ర‌భుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది. ఈక్విటీ మార్కెట్‌ను నిలకడగా ఉంచేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వంటి నియంత్రణ సంస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ షేర్ల పతనం కంపెనీ ఆధారిత సమస్యగానే చూడాలని, దేశ ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా పరిగణించకూడదని ఆమె మరోమారు స్పష్టం చేశారు. బ్యాంకులు, ఎల్‌ఐసీ వంటి బీమా కంపెనీలు ఏ ఒక్క నమోదిత కంపెనీలో అధిక స్థాయిలో పెట్టుబడులు పెట్టలేదని తెలిపారు. భారతీయ మార్కెట్లను నియంత్రణ సంస్థలు పకడ్బందీగా నియంత్రించే స్థితిలో ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. మ‌రి ఇక‌, ప్ర‌జ‌లే తేల్చుకోవాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.