Begin typing your search above and press return to search.

అలీ పోటీ చేసేది ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా...?

By:  Tupaki Desk   |   6 Feb 2023 7:45 PM GMT
అలీ పోటీ చేసేది ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా...?
X
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అయిన అలీ ఎన్నికల ఉత్సహంతో ఉన్నారు. రెండు దశాబ్దాల నాటి కల అలీది. ఆయన ఎన్నికల్లో పోటీ చేసి చట్ట సభల్లో కూర్చోవాలని చూస్తున్నారు. దానికోసం ఆయన తెలుగుదేశంలో ట్రై చేశారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి అక్కడ కూడా లక్ పరీక్షించుకున్నారు. కానీ జగన్ ఆ టైం లో టికెట్ ఇవ్వలేదు.

ఇక లేటెస్ట్ గా అలీకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అయితే అలీ చూపు అంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశం మీద ఉంది. ఈ రోజు రాజమండ్రీలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆర్‌పీఎల్‌ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.

తమ నాయకుడు జగన్ అదేసిస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయమన్నా చేస్తాను అని అలీ ప్రకటించారు. తనకు ఏ సీటు ఇచ్చినా ఓకే అని అలీ చెబుతున్నారు. అలీ సినీ నటుడిగా అందరికీ సుపరిచితం కాబట్టి ఆయనను ఏపీలో ఎక్కడ నుంచి అయినా పోటీ చేయించవచ్చు. అలాగే ఆయనకు ఎంపీగా అయినా చాన్స్ ఇవ్వవచ్చు అని అంటున్నారు అలాగే చూస్తే ఎమ్మెల్యే సీటు మీద మాత్రం ఆయనకు మోజు ఉందని అంటున్నారు.

దానికి కారణం గతంలో అలీ తనకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని ఉందని చెప్పుకున్నారు. ఇక అలీ ఆ మధ్య చిత్తూరు జిల్లా నగరిలో మీడియా మాట్లాడుతూ జగన్ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా పోటీ చేస్తాను అని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటివి మామూలే అని అన్నారు. పవన్ తాను మంచి స్నేహితులు అయినా అది సినిమాల వరకే అన్నారు.

ఇలా అలీ సంచలన స్టేట్మెంట్ ఇచ్చి ఏపీలో ఒక రచ్చ సృష్టించారు. ఇపుడు ఆయన మళ్ళీ తన మనసులో మాటను బయటపెట్టుకున్నారు. అలీ ఈసారి కచ్చితంగా పోటీ చేయాలని చూస్తున్నారు. దాని కోసం ఆయన పదే పదే మీడియా ముందు ప్రకటిస్తున్నారు అని అంటున్నారు. అయితే జగన్ ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వేలు చేయిస్తున్నారు. దాంతో చాలా మంది సిట్టింగులకు సీట్లు పోతాయని అంటున్నారు.

దాంతో అలీ లాంటి ఆశావహులలో ఉత్సాహం ఏర్పడుతోంది అని అంటున్నారు. అలీది రాజమండ్రీ. దాంతో ఆయన తన తొలి ప్రయారిటీ అక్కడే ఇస్తారని అంటున్నారు. అయితే జగన్ ఆయనకు రాజమండ్రీ నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. రాజమండ్రీ ఎంపీ సీటుకు అభ్యర్ధులు లేరు అని కూడా అంటున్నారు. అలాగే సిట్టింగ్ ఎంపీ భరత్ ని ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారు అని అంటున్నారు.

మరో వైపు వస్తున్న వార్తలు ఏంటి అంటే గుంటూరు జిల్లాలో మైనారిటీలు ఎక్కువ ఉండే సీటు నుంచి ఎమ్మెల్యేగా అలీని బరిలోకి దించుతారు అని అంటున్నారు. ఈసారి అలీకి టికెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని అంటున్నరు. అయితే ముందుగా అలీకి టికెట్ ఇచ్చే విషయం కనుక కంఫర్మ్ చేస్తే ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా అలీ ముచ్చట వైసీపీ నుంచి ఈసారి తీరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ మళ్ళీ గెలవడం ఖాయం అలీ అంటున్న వేళ ఆయన పొలిటికల్ లక్ ఎలా ఉందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.