Begin typing your search above and press return to search.

మొటిమలు.. ఆ యువతిని ఇలా బలితీస్తున్నాయి..?

By:  Tupaki Desk   |   25 May 2022 5:33 AM GMT
మొటిమలు.. ఆ యువతిని ఇలా బలితీస్తున్నాయి..?
X
మొటిమలు.. యువతులకు ఉన్న అతిపెద్ద సమస్య ఇదే. వీటి వల్ల ముఖం అందవిహీనంగా తయారవుతుంది. వీటి విషయంలో అమ్మాయిలు అంతా చాలా సీరియస్ గా ఉంటారు. కొందరు అయితే చిన్న మొటిమ వచ్చినా ఇంటి నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. ఇలానే ఓ అమ్మాయికి ఎన్ని చికిత్సలు చేయించినా మొటిమలు పోలేదు. వాటి వల్ల పెళ్లి కూడా ఆమెకు అవ్వలేదు. దీంతో మొటిమల వల్ల ఆత్మనూన్యతకు లోనైన ఆమె దారుణానికి పాల్పడింది.

ఉత్తరప్రదేశ్ లోని బిసంద పోలీస్ స్టేషన్ పరిధిలోని అజిత్ పారా గ్రామంలో నివసించే ఓ యువతికి ముఖం నిండా మొటిమలు వచ్చాయి. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా అవి తగ్గలేదు. ఆ మొటిమల వల్ల ఆమె ముఖం అందవిహీనంగా తయారైంది. ఆమెతో స్నేహం చేయడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడలేదు.

ఇక పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లు సైతం.. ఆమె మొటిమలు చూసి రిజెక్ట్ చేశారు. ఎన్ని సంబంధాలు చూసినా మొటిమలు కారణంగా చెప్పి ఈ అమ్మాయిని తిరస్కరించారు. దీంతో యువతి మానసికంగా కృంగిపోయింది. తీవ్ర ఒత్తడికి గురైంది.ఇలాంటి బ్రతుకు వద్దని నిర్ణయించుకుంది.

సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ యువతి తన గదిలోకి వెళ్లి గెడియ పెట్టుకుంది. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి తిరిగివచ్చిన కుటుంబీకులు.. డోర్ ఎంతసేటికి తీయకపోవడంతో కిటీకీలోంచి చూశారు.

అప్పుడు యువతి ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపిచింది. వెంటనే డోర్ పగులగొట్టి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ లోపం ఉన్నవారిలో మోహం మీద మొటిమలు వచ్చేలా చేస్తుంది. కొందరు ఈ విషయంపై అవగాహన ఉండడంతో వారు ఒంటరిగా ఫీలవుతున్నారు. ఒంట్లో వేడి అధికంగా ఉండడం కూడా మొటిమలు పెరగడానికి కారణంగా వైద్యులు చెబుతున్నారు. వీటి వల్ల చాలా మంది యువతులు ఆత్మనూన్యత భావానికి లోనవుతున్నారు.