Begin typing your search above and press return to search.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు !

By:  Tupaki Desk   |   19 Oct 2020 11:50 AM GMT
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు !
X
తెలుగుదేశం పార్టీ నేతలు , కార్యకర్తలు గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న టీడీపీ కమిటీలు వచ్చేశాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలు ప్రకటించారు. 24మందితో పొలిట్ ‌బ్యూరోతో పాటూ సెంట్రల్ కమిటీ, అలాగే మరికొన్ని పదవులని కూడా భర్తీ చేశారు. అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడిని కూడా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడుకు అవకాశం కల్పించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని ఎంపిక లాంఛనమే అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి దానికి తగ్గటే నేడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు. పోలిట్‌ బ్యూరలో కూడా మార్పులు జరిగాయి. పలువురు కొత్తవారికి అవకాశం కల్పించారు.

డీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అచ్చెన్నాయుడు ... గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కార్మికశాఖ మంత్రిగా వ్యవహరించిన ఈఎస్ ‌ఐ స్కాంలో ఆరోపణలతో జైలుకు కూడా వెళ్లిన అచ్చెన్నాయుడుకు పార్టీలో సానుభూతితో పాటు కీలక నేతగా ప్రత్యేక గుర్తింపు ఉంది. బీసీ వర్గానికి చెందిన నేత కావడం కూడా అచ్చెన్నాయుడికి కలిసొచ్చే మరో అంశం. దీనితో తాజాగా టీడీపీ ప్రకటించిన కమిటీల్లో ఏపీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకే చెందిన కళా వెంకట్రావు స్దానంలో అచ్చెన్నాయుడుకు అవకాశం దక్కింది.


ఇక , తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్‌.రమణను మరోసారి కొనసాగించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పరిస్ధితి దారుణంగా తయారు కావడం, అధ్యక్ష బాధ్యతలు మోసేందుకు సమర్ధుడైన నేత, పార్టీలో లేకపోవడంతో ఎల్‌.రమణనే మరోసారి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉపాధ్యక్ష పదవిలో నందమూరి కుటుంబానికి చెందిన సుహాసినికి అవకాశం దక్కింది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ దాదాపుగా భూస్థాపితం అయ్యే స్థితికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి టీడీపీ తెలంగాణ లో తిరిగి పుంజుకోవాలంటే రమణనే కొనసాగించడం మంచిది అని ఆ నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌ కొనసాగనుండగా.. పార్టీ సీనియర్లు ప్రతిభా భారతి, కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, సత్యప్రభ, తెలంగాణ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సీహెచ్‌ కాశీనాధ్‌కు ఉపాధ్యక్ష బాధ్యతలు దక్కాయి. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా లోకేష్‌తో పాటు వర్ల రామయ్య, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్త కోట దయాకర్‌రెడ్డి, బక్కని నరసింహులు, రామ్మోహన్‌ రావును నియమించారు. ఇక టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా పార్టీలో కీలక నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్‌ కుమార్‌ గౌడ్ లకి‌ చోటు దక్కింది. వీరితో పాటు లోకేష్, అచ్చెన్న, ఎల్.రమణ కూడా పొలిట్‌ బ్యూరోలో సభ్యులుగా ఉంటారు.