Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల పాల‌న‌పై.. అచ్చెన్న‌ హాట్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   1 Dec 2021 1:30 AM GMT
జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల పాల‌న‌పై.. అచ్చెన్న‌ హాట్ కామెంట్స్‌
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి.. పాల‌న‌ను ప్రారంభించి.. మంగ‌ళ‌వారంతో రెండున్నరే ళ్లు గ‌డిచిపోయాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల పాల‌న‌పై.. ప‌లువురు.. ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. వీరిలో ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు.. టెక్క‌లి ఎమ్మెల్యే.. కింజ‌రాపు అచ్చెన్నాయుడు స్పందించారు. త‌న‌దైన శైలిలో ఆయ‌న జ‌గ‌న్ పాల‌న ఇంతే! అంటూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ వ్యాఖ్య‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. వైసీపీ పాలనలో మహిళలపై అసెంబ్లీలో బూతులు, గ్రామాల్లో దాడులు.. అధికార అండతో బరితెగించి వ్యవహరిస్తున్న వారికి బడితెపూజ ఖాయం! అంటూ..

అచ్చెన్నాయుడు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

దూడ గ‌ట్టున మేయ‌దుగా!

``వైసీపీ రెండున్నరేళ్ల పాలనంతా ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా వైసీపీ వైఖరి తయారైంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళలను కించపరుస్తుంటే... గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ మహిళా సర్పంచ్ మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీమూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం`` అని అచ్చెన్న పేర్కొన్నారు.

కౌంట్ డౌన్ స్టార్ట్‌!

``మహిళలపై దాడి చేయటమే కాకుండా, బూతులు తిట్టడం దుర్మార్గపు చర్య. మహిళా హోంమంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే అర్ధం ఏంటి? ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి? అధికారం ఉంది కదా మహిళల పట్ల బరితెగించి వ్యవహరిస్తున్న వారికి ముందు రోజుల్లో మహిళల చేతిలో బడితెపూజ ఖాయం. మీ అరాచకాలు ఇక సాగవు, వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది`` అని విమ‌ర్శించారు.

టీడీపీదే అధికారం

``వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ గుర్తుంచుకోవాలి. మల్లీశ్వరి ఇంటిపై దాడి చేసిన వైసీపీ రౌడీమూకలపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడికి పాల్పడ్డవారిని, దాడికి కారణమైనవారిని వెంటనే అరెస్టు చేయాలి. రెండున్నరేళ్ల‌లో ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు ఒక అరాచ‌క పాల‌న‌ను చ‌విచూశారు. ఇక‌, వారు చాలు మొర్రో అని మొర‌పెట్టుకుంటు న్నారు. త్వ‌ర‌లోనే ఏపీలో ప్ర‌భుత్వం మార‌బోతోంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేయ‌బోతు న్నారు``అని అచ్చెన్న ధీమా వ్య‌క్తం చేశారు.