రేప్ చేసిన 22 ఏళ్ల తర్వాత నిందుతుడు అరెస్ట్ .. ఎలా దొరికాడంటే ?

Tue Feb 23 2021 23:00:01 GMT+0530 (IST)

Accused arrested after 22 years

ఒడిశా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అంజనా మిశ్రా గ్యాంగ్ రేప్  కేసులో ప్రధాన నిందితుడి బీబన్ బిశ్వాల్ ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార ఘటన జరిగిన 22 ఏళ్ల తర్వాత  నిందుతుడిని పట్టుకున్నట్లు ట్విన్ సిటీ పోలీసు కమిషన్ సుధాన్షు సారంగి వెల్లడించారు. నిందితుడిని మహారాష్ట్ర లోనావాలాలోని ఆంబీ వ్యాలీలో బిబాన్ ను అదుపులోకి తీసుకున్నామని భువనేశ్వర్ కటక్ పోలీస్ కమిషనర్ ఎస్. సారంగి వెల్లడించారు.వివరాల్లోకి వెళ్తే ... 1999లో అంజనా మిశ్రా గ్యాంగ్ రేప్ కు గురైంది.  ఐఎఫ్ ఎస్ ఆఫీసర్ మాజీ భార్య అంజనా మిశ్రాను ఆ ఏడాది జనవరి 9వ తేదీన అత్యాచారం చేశారు.  జర్నలిస్టు ఫ్రెండ్ తో కలిసి వాహనంలో వెళ్తున్న ఆమెను ముగ్గురు బలవంతంగా అత్యాచారం చేశారు. భువనేశ్వర్ శివారు ప్రాంతమైన బారంగ్ లో ఆమె రేప్ కు గురైంది. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో నిందుతులైన  పదియా సాహూ దీరేంద్ర మోహంతిలను ఆ ఏడాదే పోలీసులు అరెస్టు చేశారు. 2002లో ఖుర్దా జిల్లా సెషన్స్ జడ్జి నిందితులకు జీవితకాల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఆ తీర్పును హైకోర్టు కూడా సమర్ధించింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న బిస్వాల్.. ఐడెంటిటీ మార్చుకుని ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. రాష్ట్రంలో ఈ కేసు సంచలనం రేపడంతో.. అప్పటి సీఎం జేబీ పట్నాయక్ రాజీనామా కూడా చేశారు. ఆ తర్వాత ఈ కేసు సీబీఐ విచారణ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే మూడో నిందితుడిని పట్టుకునేందుకు ఒడిశా పోలీసులు 'సైలెంట్ వైపర్' అన్న పేరుతో ఆపరేషన్ స్టార్ట్ చేశారు.  పేరు మార్చుకున్న బీబన్.. మహారాష్ట్రలో ఓ ప్లంబర్‌గా పనిచేశాడు. ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.