Begin typing your search above and press return to search.

వీర్యకణాల వృద్ధికి పటిక బెల్లం దివ్యౌషధం

By:  Tupaki Desk   |   5 Jun 2021 1:30 PM GMT
వీర్యకణాల వృద్ధికి పటిక బెల్లం దివ్యౌషధం
X
మారుతున్న జీవనశైలి మనుషుల్లోని మగతనాన్ని చంపేస్తోంది. బిజీ లైఫ్ లో పడి అందరూ సంసార సుఖానికి దూరం అవుతున్నారు. వారానికో.. నెలకోసారి శృంగారం చేసుకునేంత బిజీలో జనాలు పడిపోయారు. ఇక తీవ్రమైన పని ఒత్తిడి, వ్యసనాలతో శృంగార సామర్థ్యం పడిపోతోంది. వీర్యకణాల సంఖ్య తగ్గి సంతాన లోపాలు సమాజంలో పెరిగిపోతున్నాయి.

ఈ క్రమంలోనే మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే వీర్య కణాలను పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీర్యకణాల వృద్ధికి పటిక బెల్లం లేదా రాక్ షుగర్ ను వాడవచ్చని సలహా ఇస్తున్నారు.

ఈ పటిక బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. పటిక బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం మాంసాహారంలో దొరికే విటమిన్ బి12 పటిక బెల్లంలో ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది.

పటిక బెల్లం మగవారిలో వీర్యం క్వాలిటీని మెరుగుపరుస్తుంది. శుక్రకణాల ఉత్పత్తిని పెంచుతుంది. పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు పటిక బెల్లం కలిపిన పాలు తాగడం ఆరోగ్యకరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా వీర్యవృద్ధితోపాటు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసే పటిక బెల్లంను మీరు వాడి అనారోగ్యాలను దూరం చేసుకోండి.