Begin typing your search above and press return to search.

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో దేశంలో టాప్-5 రాష్ట్రాల్లో ఏపీ

By:  Tupaki Desk   |   29 Aug 2022 10:30 AM GMT
రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో దేశంలో టాప్-5 రాష్ట్రాల్లో ఏపీ
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాము రైతుల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నామ‌ని.. దేశంలో మ‌రే రాష్ట్రంలోనూ ఇన్ని ప‌థ‌కాలు లేవ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఊరూవాడ వెలుగెత్తి చెప్పుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్సార్ రైతుభ‌రోసా, రైతు భ‌రోసా కేంద్రాలు, అగ్రి క్లినిక్స్, వైఎస్సార్ పంటల బీమా ఇలా వారి కోసం ఎన్నో ప‌థ‌కాలు చేప‌ట్టామ‌ని చెప్పుకుంటోంది.

మ‌రోవైపు నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2021 ప్ర‌కారం రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. గ‌తేడాది దేశంలో 10,881 మంది రైతులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటే అందులో 1,065 (9.78%) ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారేన‌ని నివేదిక వెల్ల‌డించింది.

ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఒక్కరోజులో ముగ్గురు రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నార‌ని వెల్ల‌డించింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది సొంత భూములు ఉన్న‌వారేన‌ని నివేదిక పేర్కొంది.

త‌ద్వారా రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో మహారాష్ట్ర, కర్ణాటకల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే అత్య‌ధికంగా చోటు చేసుకున్నాయ‌ని నేష‌న‌ల్ క్రైమ్ రిక్డార్స్ బ్యూరో వెల్ల‌డించింది.

వ్య‌వ‌సాయం భార‌మై.. అప్పుల‌పాలై 1065 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని పేర్కొంది. 2021లో ఏపీలో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన‌వారిలో 481 మంది రైతులు, 584 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఇక ఆర్థిక నేరాలు 2020లో 7467 న‌మోదు కాగా 2021లో 9,273 చోటు చేసుకున్నాయి. హింసాత్మ‌క నేరాలు 6683 నుంచి 7215కి పెరిగాయి. ఎస్సీల‌పై దాడులు 1950 నుంచి 2014కి.. ఎస్టీల‌పై దాడులు 320 నుంచి 361కు పెరిగాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.