Begin typing your search above and press return to search.

క‌రెంట్ ఎఫైర్ : పెద్ది రెడ్డి శాఖ లో పెద్ద త‌తంగ‌మే న‌డుస్తోంది ?

By:  Tupaki Desk   |   14 May 2022 3:29 AM GMT
క‌రెంట్ ఎఫైర్ : పెద్ది రెడ్డి శాఖ లో పెద్ద త‌తంగ‌మే న‌డుస్తోంది ?
X
మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి నిర్వ‌హిస్తున్న విద్యుత్ శాఖ‌లో పెద్ద త‌తంగ‌మే న‌డుస్తోంది. జీతాల్లేక సిబ్బంది ఏడుపులు వినేవారే లేక పెద్ద యుద్ధ‌మే న‌డుస్తోంది. రోడ్డెక్కితే ఎస్మా చ‌ట్టం ఉప‌యోగిస్తామ‌ని మ‌రోసారి రాష్ట్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రించిన నేప‌థ్యంలో దిగువ స్థాయి సిబ్బంది త‌మ క‌ష్టం ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.


లైన్ మెన్లు, సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లకు ఇప్ప‌టికీ ఏప్రిల్ నెల జీతాలు క్లియ‌ర్ కాలేదు. అంతెందుకు బిల్ రీడింగ్ బోయ్స్ కు కూడా ఇప్ప‌టిదాకా జీతాల్లేవు. వీరికి నెల‌కు 18 వేలు చొప్పున రెండు నెల‌లుగా జీతాలు చెల్లించే నాధుడు లేడు.

కాంట్రాక్ట‌ర్ల ప‌రిధిలో ప‌నిచేసే వీరంతా అప్పులు చేసి జీవ‌నం నెట్టుకు వ‌స్తున్నారు. కానీ వీరి గోడు కూడా ఎవ్వ‌రూ విన‌డం లేదు.

వాస్త‌వానికి ఎస్మా చ‌ట్టం అన్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వాలు రెన్యువ‌ల్ చేస్తుంటాయి అని, ఇదేం కొత్త కాద‌ని కొన్నిసంఘాలు మీడియా ముఖంగా చెబుతున్న మాట. అయితే తాము స‌మ్మె నోటీసు ఇచ్చిన‌ప్పుడే జ‌గ‌న్ కు ఎస్మాస్త్రం గుర్తుకు రావ‌డం విచార‌క‌రం అని అంటున్నారు వీరు.

ఆ రోజు విద్యుత్ ఛార్జీల పెంపు నేప‌థ్యాన నిర‌స‌న చేస్తే బ‌షీర్ బాగ్ లో కాల్పులు చేప‌ట్టిన బాబు ప్ర‌భుత్వానికి,ఇప్పుడు నోరెత్తితే చాలు ఒప్పుకోం అని చెప్పిన జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి పెద్ద తేడా ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నాయి కార్మిక సంఘాలు.