Begin typing your search above and press return to search.

ఏపీలో గురువుల‌పై బెత్తం.. తాజా వేధింపులు ఏ రేంజ్‌లో అంటే..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 9:30 AM GMT
ఏపీలో గురువుల‌పై బెత్తం.. తాజా వేధింపులు ఏ రేంజ్‌లో అంటే..!
X
గురు బ్ర‌హ్మ‌.. అంటూ విద్యార్థులు తెల్లారిలేస్తే.. స్మ‌రించుకునే గురువుల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. వారు త‌మ డిమాండ్ల‌పై పోరాటం చేశార‌నో.. లేక ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పారనో.. లేక‌.. త‌మ ఆదేశాల‌ను కూడా కాద‌ని మిలియ‌న్ మార్చ్‌ను నిర్వ‌హించారనో.. లేక‌.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్‌మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారనో.. ఇలా కార‌ణం ఏదో ఏదైనా కానీ.. ఇప్పుడు గురువుల‌పై మాత్రం వైసీపీ ప్ర‌భుత్తం బెత్తం ఝ‌ళిపిస్తోంది.

వేధింపుల‌కు రంగు రూపం రుచి ఉండ‌ద‌న్న‌ట్టుగా.. ఏ రూపంలో అయినా ఉంటాయి. స‌మ‌యానికి రాక‌పోయి నా.. ముందుగానే వెళ్లిపోయినా.. సెలవు పెట్టినా..వేధించాల‌ని అనుకున్న‌ప్పుడు.. ఉద్యోగుల‌ను ఇబ్బంది పెట్టాల‌ని అనుకున్న‌ప్పుడు.. కార‌ణాల‌తో పనిలేదు.. కార‌ణాన్ని వెతకాల్సిన అవ‌స‌రం కూడా అంత‌కంటే లేదు. ప్ర‌తి దానినీ కార‌ణంగానే మ‌లుచుకునే అవ‌కాశం ఉంది. ఉంటుంది. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం అదే చేస్తోంది.

ఉపాధ్యాయుల‌ను వేధింపుల‌కు గురి చేయాల‌ని భావించిన స‌ర్కారు... ఇప్ప‌టికే ఉద్యోగ సంఘాల నాయ‌కు లకు.. అద‌ర్ డ్యూటీ(ఓడీ) సెల‌వులు మంజూరు చేసిన ప్ర‌భుత్వం ఈ ఏడాది ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సెల‌వులు లేకుండా చేసింది.

అంటే.. ఉద్యోగుల త‌ర‌ఫున సంఘాలుగా ఏర్ప‌డే నాయకులు వారి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం చుట్టూ తిరిగేందుకు వారు సెల‌వులు పెట్టుకునే అవ‌కాశం ఉంటుంది. దీనివ‌ల్ల వారి వేత‌నం క‌ట్ కాదు. కానీ, ఉపాధ్యాయ నేత‌ల‌కు మాత్రం దీనిని తీసేశారు

ఇక‌, ఇప్పుడు తాజాగా ఉపాధ్యాయుల వేత‌నాల విష‌యంలోనూ.. ప్ర‌భుత్వం వేధింపుల‌కు పాల్ప‌డుతోంద నే వాద‌న వినిపిస్తోంది. అంటే.. అంద‌రికీ ఇచ్చి.. ఉపాధ్యాయుల‌కు మాత్రం చాలా ఆల‌స్యం చేస్తోంద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం అప్పుల్లో ఉన్నా.. ఉద్యోగుల‌కు నెల‌లో 5 లేదా 10వ తారీకు నాటికి వేత‌నాలు మంజూరు చేస్తోంది.

కానీ, ఉపాధ్యాయుల‌విష‌యానికి వ‌స్తే మాత్రం అంద‌రూ అయిన త‌ర్వాత‌.. నిధులు ఉంటే వేయ‌డం లేక పోతే.. వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం అనే పంథాను ఎంద‌చుకుంది. దీంతో ఉపాధ్యాయులు అల్లాడిపోతున్నారు. ఇదేం ఖ‌ర్మ‌.. అని త‌మ‌లో తాము తిట్టుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.