Begin typing your search above and press return to search.

ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు.. బ‌హిష్క‌ర‌ణ బాట‌లో టీడీపీ!

By:  Tupaki Desk   |   18 May 2021 4:30 PM GMT
ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు.. బ‌హిష్క‌ర‌ణ బాట‌లో టీడీపీ!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బ‌హిష్క‌ర‌ణ బాట వ‌దిలిపెట్ట‌ట్లేదు. ఆ మ‌ధ్య ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించి, స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న బాబు.. ఇప్పుడు బ‌డ్జెట్ స‌మావేశాల‌ను కూడా బహిష్క‌రిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ఈ నెల 20న నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే.. క‌రోనా తీవ్రస్థాయిలో ఉన్నందున ఒకే రోజు స‌మావేశాలు కొన‌సాగించాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్‌ హరిచందన్ అప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు.

అయితే.. ఈ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించాల‌ని టీడీఎల్పీ నిర్ణ‌యించింది. మంగళవారం నిర్వ‌హించిన‌ వర్చువల్ సమావేశంలో బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించాలని స‌భ్యులు నిర్ణ‌యించారు. రాష్ట్రంలో ప్ర‌తీకార రాజ‌కీయాల‌కే ప్రాధాన్యం ఇస్తున్న ప్ర‌భుత్వం.. క‌రోనా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మైందని ఆరోపించారు.

క‌రోనా మొద‌లు రాష్ట్రంలో చ‌ర్చించాల్సిన స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయ‌ని అన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో.. కేవ‌లం ఒకేరోజు స‌మావేశాలు నిర్వ‌హించ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక రోజు స‌మావేశాల‌తో జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని పొగిడించుకోవాల‌ని చూస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు.కాగా.. గురువారం జ‌ర‌గ‌బోయే బ‌డ్జెట్ స‌మావేశాల్లో తొలుత గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంటుంది. ఆ త‌ర్వాత 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్ ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెడ‌తారు.