Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలిసారి వినూత్న యాప్...ఏపీ పోలీసుల ఘనత

By:  Tupaki Desk   |   21 Sep 2020 4:30 PM GMT
దేశంలోనే తొలిసారి వినూత్న యాప్...ఏపీ పోలీసుల ఘనత
X
ఈ టెక్ జమానాలో యాప్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వయసున్నవారి వరకు యాప్ లు, సోషల్ మీడియా, వాట్సాప్ లను వినియోగిస్తున్నారు. కాబట్టి అందుకే వివిధ ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య శాఖకు సంబంధించిన వివరాలు సైతం యాప్ ల ద్వారా అందించేందుకు ప్రభుత్వాలు యాప్ లు రూపొందించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసు శాఖ కూడా ఓ సరికొత్త యాప్ ను ప్రవేశపెట్టింది. పోలీస్ స్టేషన్ నే ప్రజల అరచేతిలోకి తెచ్చేలా ఓ యాప్ ను రూపొందించింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ ఓ యాప్ ను రూపొందించింది ఏపీ పోలీస్ శాఖ. స్టేషన్‌‌కు ప్రజలు నేరుగా వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలను ‘ఏపీ పోలీస్‌ సేవ’యాప్ ద్వరా అందుబాటులోకి తీసుకువచ్చింది. పోలీసు స్టేషన్‌ లో లభించే అన్ని సేవలను ఈ యాప్‌ ద్వారా పొందొచ్చు. అన్ని నేరాలపై కంప్లైంట్ చేసే చాన్స్, ప్రతి కంప్లైంట్‌కీ రశీదు పొందే చాన్స్ ఈ యాప్ ద్వారా ప్రజలకు లభిస్తాయి.

దర్యాప్తు వివరాలు, అరెస్టులు, FIRలు, రికవరీలు, రోడ్డు భద్రత, సైబర్‌ సెక్యూరిటీ, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు పర్మిషన్లు, NOCలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్‌ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అనేక పోలీసు సేవల్నీ యాప్‌ ద్వారా పొందవచ్చు. ఏపీ పోలీస్‌ సేవ యాప్‌‌ నుంచే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌‌లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. అత్యవసర సమయంలో ఎవరైనా వీడియో కాల్‌ ద్వారా నేరుగా పోలీస్‌ కంట్రోల్‌ రూంకు సమాచారం అందించడం ఈ యాప్ ప్రత్యేకత. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారం నిజమా కాదా అని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం, ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టడం వంటివి ఈ యాప్ ద్వారా చేయవచ్చు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌ ఈ యాప్ లో ఉన్నాయి.

6 విభాగాల్లో ఏపీ పోలీస్‌ సేవ యాప్ ద్వారా 87 రకాల సేవలు అందించనున్నారు.

శాంతి భద్రతలు:
- నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు
- ఎఫ్‌ఐఆర్‌ స్థితిగతులు, డౌన్‌లోడ్‌
- దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు
- తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు
- అరెస్టుల వివరాలు
- వాహనాల వివరాలు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సేవలు :
- ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్‌ సర్వీసు(ఎల్‌ఎంఎస్‌) , ఇ–బీట్‌)
- ఇ–చలానా స్టేటస్‌

పబ్లిక్‌ సేవలు:
- నేరాలపై ఫిర్యాదులు
- సేవలకు సంబంధించిన దరఖాస్తులు
- ఎన్‌వోసీ, వెరిఫికేషన్లు
- లైసెన్సులు, అనుమతులు
- పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌

రహదారి భద్రత:
- బ్లాక్‌ స్పాట్లు
- యాక్సిడెంట్‌ మ్యాపింగ్‌
- రహదారి భద్రత గుర్తులు
- బ్లడ్‌ బ్యాంకులు, డయాలసిస్‌ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు

ప్రజా సమాచారం:
- పోలీస్‌ డిక్షనరీ
- సమీపంలోని పోలీస్‌స్టేషన్‌
- టోల్‌ఫ్రీ నంబర్లు
- వెబ్‌సైట్ల వివరాలు
- న్యాయ సమాచారం
- ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు

ప్రజా సమాచారం:
- పోలీస్‌ డిక్షనరీ
- సమీపంలోని పోలీస్‌స్టేషన్‌
- టోల్‌ఫ్రీ నంబర్లు
- ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు
- వెబ్‌సైట్ల వివరాలు
- న్యాయ సమాచారం