Begin typing your search above and press return to search.

బస్సు యాత్ర : బసకు ఎంత ఖర్చు చేశారంటే...?

By:  Tupaki Desk   |   29 May 2022 2:30 AM GMT
బస్సు యాత్ర : బసకు ఎంత ఖర్చు చేశారంటే...?
X
ఏపీలో ఇపుడు సామాజిక సమర భేరీ పేరిట మంత్రుల బస్సు యాత్ర సాగుతోంది. ఈ యాత్ర ఖర్చుని ప్రభుత్వమే భరిస్తోంది. ఒక విధంగా ఇది అదనపు ఖర్చుగానే చూడాలి. ఎందుకంటే ఆయా జిల్లాలలో ఎక్కడికక్కడ మంత్రులు ఉంటారు. వారు తమ ప్రాంతాలలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న సామాజిక న్యాయం చెప్పుకుంటే సరిపోయేది. కానీ పదిహేండు మంది మంత్రులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ పదవులలో ఉన్న వారు అంతా బస్సు యాత్రలో పాలుపంచుకుంటున్నారు.

దాంతో ఖర్చు తడిసిమోపేడు అవుతోంది. విశాఖ వచ్చిన బస్సు యాత్ర ఒక్క పూట మాత్రమే అక్కడ గడిపింది. కానీ అయిన ఖర్చు మాత్రం తడిసి మోపెడు అయింది అంటున్నారు. వచ్చిన మంత్రులతో పాటు ప్రముఖులు అందరికిఈ కలిపి స్టార్ హొటళ్ళలో రూమ్స్ డెబ్బై దాకా తీసుకున్నారు. కేవలం ఒక్క పూట బసచేయడానికి మాత్రమే. మరి ఆయా రూమ్ ఖర్చు ఒక్కోదానికి పదివేల రూపాయలు అన్న మాట.

ఇక గతంలో టీడీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు విశాఖ వస్తే ఒక హొటల్ కే అన్నీ అప్పగించి అక్కడే కార్యక్రమాలు పెట్టి ఆ హొటల్ యాజమాన్యానికి మేలు చేశారంటూ ఆరోపించిన వైసీపీ వారు ఇపుడు అదే హొటల్ లో తామూ బస చేశారు.

ఆ విధంగా ప్రభుత్వ ఖర్చుని అక్కడ రాసేశారు అన్న మాట. ఇక ఇంత పెద్ద ఎత్తున ఏపీలో బీసీలకు న్యయం జరుగుతోంది అని చెప్పుకునే ఈ యాత్రలో మంత్రులు కనీసం తమకు సమీపంలో ఉన్న బీసీలు ఎలా ఉన్నారు. బీసీ విద్యార్ధుల కొరకు ఏర్పాటు చేసిన పాఠశాలలు ఎలా నడుస్తున్నాయన్నది వాకబు చేయలేదని విమర్శలు ఉన్నాయి.

అనకాపల్లిలో బీసీల కోసం జ్యోతీరావు ఫూలే గురుకుల పాఠశాలను మంజూరు చేస్తే దానికి ఈ రోజు వరకూ స్థలం కేటాయింపు లేదు, అద్దె భవనంలోనే మగ్గుతోంది. అలాగే అక్కడ బీసీ విద్యార్ధుల సంఖ్యను అద్దె భవనం కారణంగా సగానికి తగ్గించేశారు. ఇక ప్రభుత్వ స్థలం చూపించండి అంటే అధికారులేమో సమీపంలోకి కొండ మీద చూపించారు. మొదట పదిహేను ఎకరాల స్థలం ఇస్తామని చెప్పి అయిదు ఎకరాలకు కుదించారు.

ఇక ఆ కొండ మీద క్వారీ తవ్వకాలు జరుగుతాయి. మరి క్వారీ బాంబుల మధ్యనే రేపటి రోజున బీసీ గురుకుల పాఠశాల నడవాలి అన్న మాట. మంత్రులు తీరుబడి చేసుకోనక్కరలేదు, తాము వెళ్తున్న బస్సుని ఆపి ఇలాంటి బీసీల పాఠశాలను చూసి వాటి దుస్థితిని తీర్చే గట్టి మేలు చేస్తే యాత్ర సక్సెస్ అయినట్లు కాదా అని అంతా అడుగుతున్నారు. మొత్తానికి బీసీ మంత్రులు అణగారిన మంత్రులు వచ్చారు, మా దగ్గరకు అనుకుంటే వారు బస్సులు దిగి హొటళ్ళకు వెళ్ళిపోతే ఎలా కలిసేది, ఏలా మా సమస్యలు చెప్పుకునేది అని బడుగు జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ యాత్ర పరమార్ధం నెరవేరలేదని తెలుస్తోంది కదా.