Begin typing your search above and press return to search.

ఎందుకు? జగన్ తో భేటీ.. రోజా టెన్షన్ అంతా ఇంతా కాదట?

By:  Tupaki Desk   |   15 Aug 2022 12:30 AM GMT
ఎందుకు? జగన్ తో భేటీ.. రోజా టెన్షన్ అంతా ఇంతా కాదట?
X
ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ మీద పంచ్ లు వేసే విషయంలో వెనుకా ముందు ఆడకుండా చెలరేగిపోయే ఏపీ లేడీ ఫైర్ బ్రాండ్ గా మంత్రి ఆర్కే రోజాకు ఉన్న పేరుప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దూకుడు పార్టీగా పేరున్న వైసీపీలో.. దూకుడుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రోజా.. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆమె ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదన్న మాట వినిపిస్తోంది. త్వరలో ఏపీ ముఖ్యమంత్రి.. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించే నియోజకవర్గ రివ్యూ సమావేశం ఏమవతుుందన్నది రోజా టెన్షన్ గా చెబుతున్నారు.

రెండోసారి అధికారం సాధించటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇటీవల కొత్త కార్యక్రమాన్ని చేపట్టటం తెలిసిందే. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. స్థానిక కార్యకర్తల నుంచి అభిప్రాయాల్ని సేకరిస్తూ.. వాటి ఆధారంగా నియోజకవర్గానికి చేయాల్సిన శస్త్రచికిత్స గురించి జగన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ.. రోజాకు వచ్చిన సమస్య ఏమంటే.. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం మొత్తం గ్రూపులు.. అసమ్మతితో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

రోజాకు మంత్రి పదవి రాక ముందే కాదు పదవి వచ్చిన తర్వాత కూడా ఆమె నియోజకవర్గంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తాను తీసుకెళ్లే వారు.. ముఖ్యమంత్రితో ఏం చెబుతారో? ఎలాంటి ఫిర్యాదులు చేస్తారో అన్నదిప్పుడు టెన్షన్ గా మారిందంటున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో రివ్యూ నిర్వహించిన జగన్.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ను భరత్ కు ఇస్తామని చెప్పటమే కాదు.. గెలిస్తే మంత్రిని కూడా చేస్తామని చెప్పటం తెలిసిందే.

గ్రూపులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నగరిలో.. రోజురోజుకు తగదాలు.. గొడవలు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. వాటిని ఒక కొలిక్కి తెచ్చే విషయంలోనూ రోజా సక్సెస్ కాలేదంటున్నారు. దీనికి తోడు తన నియోజకవర్గంలోని వర్గపోరుకు పుల్ స్టాప్ పెట్టేలా చేయాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పంచాయితీ ఎన్నికలు మొదలు మొన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు ఏదో ఒక రచ్చ తప్పించి.. ఇంకొకటి లేని పరిస్థితి.

నిజానికి రోజాకు వర్గపోరు ఇప్పుడేం కొత్త కాదు. పార్టీలో చేరిన నాటి నుంచి ఆమె ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాలం గడుస్తున్నకొద్దీ తగాదాలు పెరగటమే కానీ తగ్గింది లేదు. ఈ మధ్యన నిర్వహించిన నగర ప్లీనరీకి రోజా ఆహ్వనం పంపినా.. ఎవరూ హాజరు కాక షాకిచ్చారు. ఈ రచ్చ సరిపోనట్లు తాజాగా గ్రానైట్ గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటివేళ.. సీఎం నుంచి పిలుపు వస్తే.. రివ్యూ మీటింగ్ కు ఎవరిని తీసుకెళ్లాలి? అన్నది రోజాకు సమస్యగా మారిందంటున్నారు. సీఎం జగన్ నుంచి పిలుపు వస్తే.. వైరి వర్గానికి సమాచారం అందించాలా? లేదా? లేకుండా వెళితే ఆయనేమంటారు? అన్నది తేల్చుకోలేకపోతున్నారట. పిల్లలకు పబ్లిక్ ఎగ్జామ్ ఎలానో.. రోజాకు జగన్ తో రివ్యూ భేటీ అదే మాదిరిగా మారిందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.