మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం ... ఒకరు మృతి !

Tue Jul 07 2020 12:20:44 GMT+0530 (IST)

AP Minister Escort Vehicle met with an accident

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఎస్కార్ట్ వాహనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర ప్రమాదానికి గురైంది. పెద్ద అంబర్ పెట్ ఔటర్ రింగ్ రోడ్ పై అదుపు తప్పి ఎస్కార్ట్ వాహనం బోల్తా కొట్టింది. ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ కావడంతో బొలెరో వాహనం పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ పాపయ్య అక్కడికక్కడే  మృతిచెందగా.. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హయత్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.