Begin typing your search above and press return to search.

అమాత్యా... అంబ‌టీ.. ఇలా హ‌ద్దు మీర‌వ‌చ్చా!!: నెటిజ‌న్ల ట్రోలింగ్‌

By:  Tupaki Desk   |   15 May 2022 6:32 AM GMT
అమాత్యా... అంబ‌టీ.. ఇలా హ‌ద్దు మీర‌వ‌చ్చా!!:  నెటిజ‌న్ల ట్రోలింగ్‌
X
రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లు.. కామ‌నే. అయితే.. ఇది స్థాయిల‌ను బ‌ట్టి.. ఉంటుంది. ఒక గ‌ల్లీ స్థాయి నాయ‌కుడి లెవెల్ వేరుగా ఉంటుంది. ఏదైనా మాట్లాడొచ్చు. ఎలాగైనా.. కామెంట్లు చేయొచ్చు. కానీ, ఒక ఎమ్మెల్యే స్థాయి నేత వ్య‌వ‌హార శైలి దీనికి భిన్నంగా ఉంటుంది. ఒకింత ఆధారాలు.. ప‌క్కా ప్రూఫ్‌లు పెట్టుకుని మాట్లాడుతారు. ఇక‌, మంత్రి స్థాయిలో ఉన్న వారి ప‌రిస్థితి ఏంటి? అంటే.. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఎంత ఆవేశం వ‌చ్చినా.. ఆ స్థానానికి విలువ ఇవ్వాలి.

ఆ స్థానానికి ఉన్న గౌర‌వాన్ని కూడా చూసుకోవాలి. నిక్క‌చ్చిగా స‌మాధానాలు ఇస్తూనే.. ప్ర‌త్య‌ర్థుల‌కు.. కౌం టర్లు ఇస్తూనే.. త‌మ మంత్రి పీఠానికి త‌గిన విధంగా వ్య‌వ‌హ‌రించాలి. అయితే.. ఇక్క‌డ వైసీపీ స‌ర్కారులో ఉన్న మంత్రులు స‌హ‌నం కోల్పోతున్నారు. తాము అమాత్య‌స్థానంలో ఉన్నామ‌ని.. రాష్ట్ర‌మే కాకుండా.. పొరుగు రాష్ట్రాల వారు కూడా త‌మ‌ను ప‌రిశీలిస్తార‌ని.. వారు మ‌రిచిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే నోటికి ఎంత మాట ప‌డితే.. అంత మాట అనేస్తున్నారు.

గ‌త కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేసిన కొడాలి నాని.. ఇలా వివాదాస్ప‌దం కాగా, ఇప్పుడు మంత్రులుగా ఉన్న‌ రోజా.. వ‌నిత‌.. వంటివారు కూడా ఇలానే వివాదం అవుతున్నారు. ఇక‌, తాజాగా జ‌ల‌వ‌న‌రుల మంత్రి అంబ టి రాంబాబు.. ఇష్టానుసారంవ్యాఖ్య‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఆయ‌న మీడియా తో మాట్లాడుతూ.. ``నీ జాంకాయ్‌.. క‌డుక్కుని తింటావో.. తుడుచుకుని తింటావో నీ ఇష్టం`` అని వ్యాఖ్యా నించి.. అభాసు పాల‌య్యారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు నెటిజ‌న్లు `జాంకాయ్‌` మంత్రి అని పేరు పెట్టారు.

ఇక‌, దీని త‌ర్వాత‌.. ఆయ‌న మ‌రింత రెచ్చిపోతున్నారు. తాజాగా విప‌క్ష నేత‌లు చేసిన విమ‌ర్శ‌ల‌పై రాంబా బు మ‌రింత రెచ్చిపోయారు. సంచ‌ల‌న ట్వీట్ చేశారు.. అదేంటంటే..

స్విమ్మింగ్ పూల్ లో చిల్ అయ్యే చినబాబు
పక్కలేసి పార్టీని లాక్కున్న పెదబాబు
చింతకాయల సోంబేరి, వంకాయల బనిత
ఈనాడు+ఆంధ్రజ్యోతి+టీవీ5
నా క్యారెక్టర్ మీద
ఎంత రాసిన..ఎంత కూసినా.. ఎంత మొరిగినా
నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు !
మీరందరూ నా వెంట్రుకతో సమానం!! అని పేర్కొన్నారు.

అయితే.. దీనిపైనే నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. బాధ్య‌తాయుత మంత్రిగా ఉన్న అంబ‌టి.. ఇలాం టి వ్యాఖ్య‌లు చేయొచ్చునా..అనేది.. వారి ప్ర‌శ్న‌. అంతేకాదు.. క‌నీసం.. మంత్రి పీఠానికి అయినా.. విలువ ఇవ్వాలి క‌దా! అంటున్నారు.

విప‌క్షాలు.. హ‌ద్దులు మీరొచ్చా!!

``మ‌నం అధికారంలో ఉన్న మంత్రులు హ‌ద్దులు మీరుతున్నార‌ని.. అంటున్నాం.. వారికి.. కొన్ని నిర్దిష్ట ప‌రిధులు ఉన్నాయ‌ని చెబుతున్నాం. కానీ, బాధ్య‌తా యుత ప్ర‌తిప‌క్షం కూడా త‌మ‌కు హ‌ద్దులు ఉన్నాయ‌నే విష‌యాన్ని గుర్తించాలి. మంత్రుల‌పై అస‌భ్య ప్ర‌చారం.. అసాంఘిక ప్ర‌చారం.. వంటి చేయ‌డం.. వారిని వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌డం.. వ్య‌క్తిత్త హ‌ననానికి పూనుకోవ‌డం విప‌క్షాలుగా స‌రికాదు. కామ్రెడ్ పుచ్చ‌ల ప‌ల్లి సుంద‌ర‌య్య చూపినంత ఉన్న‌త స్థాయి చూప‌క‌పోయినా నిర్మాణాత్మ‌క విమ‌ర్శలు చేస్తే.. చాలు`` అని ఒక సీనియ‌ర్ న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు.