Begin typing your search above and press return to search.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో టాప్ లో ఏపీ!

By:  Tupaki Desk   |   30 Jun 2022 10:33 AM GMT
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో టాప్ లో ఏపీ!
X
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబ‌ర‌వ‌న్ గా నిలిచింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 30న టాప్ అచీవర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించ‌గా ఏపీ టాప్ ర్యాంకు ద‌క్కించుకుంది.

బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020కు సంబంధించి ఏపీ టాప్ లో చోటు ద‌క్కించుకుంది. మ‌రో తెలుగు రాష్ట్రం తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన టాప్ అచీవ‌ర్స్ జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా.. ఆ త‌ర్వాత స్థానాల్లో గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, పంజాబ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద‍్ర ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా విభ‌జించి రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించింది.

అలాగే అచీవ‌ర్స్ లిస్టులో 80-90 శాతం స్కోర్‌తో హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప‍్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా అస్పిరర్స్‌ లిస్టులో 50 నుంచి 80 శాతం స్కోర్‌తో అసోం, ఛత్తీస్‌గఢ్‌, గోవా, జార్ఖండ్‌, కేరళ, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్ చోటు ద‌క్కించుకున్నాయి.

ఇక ఎమర్జింగ్​ బిజినెస్​ ఎకోసిస్టమ్స్​ విభాగంలో 50శాతం కంటే తక్కువ స్కోర్‌తో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చోటు ద‌క్కించుకున్నాయి. వీటిలో ఢిల్లీ, పుదుచ్చేరి, త్రిపుర త‌దిత‌రాలు నిలిచాయి.

ఈసారి ర్యాంకుల ప్ర‌క‌ట‌న కోసం 10,200 మంది పెట్టుబడిదారులు, స్టాక్‌ హోల్డర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వీరిలో ఎక్కువ మంది ఏపీకి ఓటేయ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి ఏపీ టాప్ లో నిలిచింది.