నన్ను క్షమించండి.. తప్పు జరిగిందన్న ఏపీ హోంమంత్రి!

Sun Sep 27 2020 16:40:39 GMT+0530 (IST)

AP Home Minister Saying Sorry

‘తప్పు జరిగింది.. నన్ను క్షమించండి’ అంటూ ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం అత్యుత్సాహం వల్ల పొరపాటున సమాధుల కూల్చివేత సంఘట జరిగినట్లు ఆమె పేర్కొన్నారు.గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సమాధులు కూల్చిన శ్మశాన వాటినకను హోంమంత్రి సుచరిత సందర్శించారు. శ్మశాన వాటికలో సమాధుల కూల్చివేత ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా హోంమంత్రి తెలిపారు.

సమాధులను పొరపాటున కూల్చడం కారణంగా సంబంధిత కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయన్న సుచరిత.. జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. పొరపాటుకు పెద్ద మనసు చేసుకొని క్షమించమని కోరుతున్నట్లు తెలిపారు.

కాగా ఈ సంఘటనకు కారణమైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత  తెలిపారు. పడగొట్టిన అన్ని సమాధులను తిరిగి నిర్మించి ఇవ్వడమే కాకుండా శ్మశానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.