Begin typing your search above and press return to search.

నిరుద్యోగులకు శుభవార్త..వచ్చే నెలలో మెగా డీఎస్సీ !

By:  Tupaki Desk   |   9 Dec 2019 8:27 AM GMT
నిరుద్యోగులకు శుభవార్త..వచ్చే నెలలో మెగా డీఎస్సీ !
X
ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 7900 పోస్టులతో డీఎస్సీ ఉంటుందని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో నిర్వహిస్తామంటున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు పై విధంగా మంత్రి సమాధానమిచ్చారు. 7900 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి సురేష్ ప్రకటన చేశారు. మొత్తానికి చూస్తే డీఎస్సీ కోసం ఇన్ని రోజులుగా వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఇదొక శుభవార్తేనని చెప్పవచ్చు.

ఇకపోతే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని.. వచ్చే జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉంచే ప్రసక్తే లేదని.. జనవరి నెల సమీపిస్తున్నందున నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పుడు సీఎం చెప్పినట్లుగానే మెగా డీఎస్సీకి ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇప్పటికే గ్రామవాలంటీర్ - వార్డ్ వాలంటీర్ - గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు అంగన్‌ వాడీ - ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే.