ఏపీ కేబినెట్ భేటి: సీఎం జగన్ కీలక నిర్ణయం..

Tue Feb 23 2021 16:22:19 GMT+0530 (IST)

AP Cabinet meeting: CM Jagan's key decision

ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి సంబంధించి ఇప్పటికే 50శాతం నిర్మాణం పూర్తయి పెండింగ్ లో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి ఏఎం ఆర్డీయేకు రూ. 3వేల కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.ఇప్పటికీ ప్రారంభం కానీ.. కొద్దిగా ప్రారంభమైన ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ లో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

నవరత్నాలు అమలు క్యాలెండర్ కు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇదివరకు తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక  ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45 వేల ఆర్ధిక సాయం 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు పథకం వర్తింపును ఆమోదించింది.

పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు ఆమోదించింది. 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్‌కు ఆమోదం తెలిపింది.