Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్‌కు ఘోర అవ‌మానం.. స‌భ నుంచి మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన మ‌హిళ‌లు

By:  Tupaki Desk   |   16 May 2022 2:02 PM GMT
సీఎం జ‌గ‌న్‌కు ఘోర అవ‌మానం.. స‌భ నుంచి మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన మ‌హిళ‌లు
X
ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా ఈ రోజు.. ఏలూరు జిల్లా గ‌ణ‌ప‌వ‌రంలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ రైతు భ‌రోసా ప‌థ‌కం కింద 50 ల‌క్ష‌ల మందికిపైగా రైతుల‌కు 3వేల కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డి సాయంగా అందించారు. దీనికి సంబంధించి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక‌, సీఎం జ‌గ‌న్ స‌మావేశం అంటే.. నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌ను త‌ర‌లిస్తారు. అయితే.. ఈ స‌భ‌లో మ‌హిళ‌లు సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగిస్తుండ‌గానే .. మ‌ధ్య‌లోనే వెళ్లిపోయారు. అది కూడా సీఎం జ‌గ‌న్‌కు దండం పెట్టి మ‌రీ వెళ్లిపోవ‌డం.. ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. అదేస‌మ‌యంలో వైసీపీలో చ‌ర్చ‌నీయాంశం కూడా అయింది.

సీఎం సభ నుంచి మహిళలు వెళ్లిపోయారు. గణపవరంలో రైతు భరోసా నాలుగో విడత సభలో సీఎం ప్రసంగిస్తుండగానే చాలామంది మహిళలు సభ నుంచి వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు వాలంటీర్లు, పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అధిక సంఖ్యలో మహిళలు వెళ్లిపోవడంతో సభా ప్రాంగణం బోసిపోయింది. ఏలూరు జిల్లా గణపవరంలో 4వ విడత రైతు భరోసా నగదు బదిలీ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. సభలో సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే మహిళలు సభ నుంచి వెళ్లిపోయారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రసంగించారు.

అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించ‌డం ప్రారంబించారు. అయితే.. ఆయ‌న సుదీర్ఘంగా ప్ర‌సంగించ‌డం.. త‌డ‌వ తడ‌వ‌కు మాజీ సీఎం చంద్ర‌బాబును, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను.. ప‌త్రిక‌ల‌ను తిట్ట‌డంతోనే ఎక్కువ స‌మ‌యం తీసుకున్నారు. దీంతో విసిగిపోయారో.. లేక‌.. ఈ సొద మాకెందుకు అనుకున్నారో.. ఏమో.. తెలియ‌దు కానీ.. మధ్యలోనే సభ లో ఉన్న మహిళలు.. పెద్ద సంఖ్య‌లో సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. భారీ స్థాయిలో మహిళలు వెళ్లిపోవడంతో సభా ప్రాంగణం బోసిపోయింది. సభ నుంచి వెళ్తున్న మహిళలను ఆపడానికి వాలంటీర్లు, పోలీసులు ప్రయత్నించారు.

అయినా మహిళలు బలవంతంగా వెళ్లిపోయారు. తాము రామ‌ని చెబుతున్నా.. బలవంతంగా సభకు తీసుకెళ్లారని.. తాము వెళ్లిపోతామని పలువురు మహిళలు తెలిపారు. ఎండలు అధికంగా ఉండటంతో సభ ప్రాంగణంలో మహిళలు కూర్చోలేకపోయా రు. దీనికి తోడు మ‌హిళ‌ల‌ను, వృద్ధుల‌ను కూడా వైసీపీ నాయ‌కులు త‌ర‌లించినా.. వారికి స‌రైన ఏర్పాట్లు చేయ‌లేక పోయారు. ఫ్యాన్లు పెట్టారు కానీ.. తీవ్ర‌మైన ఉక్క‌పోత‌. మండుటెండ నుంచి వారికి ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌లేక పోయారు. అదేస‌మ‌యంలో మంచ‌నీళ్ల పాకెట్లను కూడా స‌రిగా ఇవ్వ‌లేక పోయారు. దీంతో మ‌హిళ‌లు, వృద్ధులు త‌మ దారి తాము చూసుకున్నారు. కాగా, తూర్పు గోదావ‌రి జిల్లా ఇంచార్జ్ మంత్రి దీనిపై స్థానిక నేత‌ల‌ను అక్క‌డే తిట్టిపోసిన‌ట్టు స‌మాచారం.