సీఎం జగన్ జీవితంలో అరుదైన రోజు ఇదే ! ఎందుకంటే ?

Fri May 13 2022 21:10:41 GMT+0530 (IST)

AP CM Ys Jagan Mohan Reddy

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ కు ఆ  రోజు  (13/5/2011) ఎంతో కీలకం. ఆ రోజున కడప బై ఎలక్షన్ ఫలితం వచ్చిన రోజు. సరిగ్గా 11 ఏళ్ల కిందట జగన్ అనే వ్యక్తి తన సత్తా నిరూపించిన వైనం ఎంతో కీలకం.  ఆవిధంగా జగన్ ను నాయకుడిగా మార్చిన కడప బై పోల్ లో ఎంపీగా మరోసారి గెలిచారు. 545672 ఓట్ల మెజారిటీతో అఖండ విజయాన్ని సాధించి విజయ దుందుభి మోగించారు. అటుపై ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.ఆ రోజు ఆయన ప్రత్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసిన డీఎల్ రవీంద్రా రెడ్డి ఇప్పుడు పొడ లేకుండా పోయారు. ఆ రోజు ఆయనకు లక్షకు పైచీలు ఓట్లు వచ్చాయి.ఇక తెలుగుదేశం తరఫున పోటీ చేసిన మైసూరా రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారో ఎంత వరకూ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారో కూడా తెలియదు. కాల గతిలో ఆయన జగన్ చెంత కు చేరారు.

అంతకుముందు అప్పుడెప్పుడో రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకంను వైఎస్ కు వ్యతిరేకంగా రాశారు. ఆ తరువాత రాయలసీమ రాజకీయాల్లో అస్సలు ఇమడలేకపోయారు. మొదట్నుంచి కడప రాజకీయాల్లో వైఎస్ కు వ్యతిరేకంగా ఉన్న డీఎల్ కూడా ఎక్కడున్నారో తెలియదు. పెద్దగా ఆయన యాక్టివ్ గా కూడా లేరు.

కాలం గొప్పది కదా ! ఇప్పుడు వీరిద్దరూ ఎలా ఉన్నా ఆ రెండు పార్టీలు ఎలా ఉన్నా తిరుగులేని నేతగా ఈ పదకొండేళ్ల ప్రయాణంలో జగన్ ఎదిగారు. కాంగ్రెస్ ఇంకా రాజస్థాన్ దారుల్లో చింతన్ శివిర్ పేరిట అంతర్మథనం చెందుతోంది. పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్న విషయాలపై తర్జనభర్జన పడుతోంది. టీడీపీ ఏటికి ఎదురీదుతూ ఉంది.

పార్టీ బలోపేతానికి ఆ ఒక్కడి కష్టం సరిపోతుందా? ఏదేమయినప్పటికీ కాంగ్రెస్ కు అడ్రస్ లేదు. జగన్ ను అవమానించిన కాంగ్రెస్ కు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా పట్టులేదు. ఉనికి లేదు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలు రేపో మాపో పూర్తి స్థాయి కల్యాణ మండపాలుగా మారిపోనుండడం ఖాయం.

ఇక టీడీపీ కూడా అంతే ! ఎదురీతల ప్రయాణంలో ఉంది. కాస్త కాదు చాలా ఎక్కువ కష్టపడితే చంద్రబాబు మాత్రమే కాదు ఇతరలూ కష్టపడితే మంచి ఫలితాలు వచ్చే వీలు ఉంది. లేదంటే వైసీపీ అధికార హవాకు సైకిల్ కు గమ్యం తాలుకా చిరునామా దొరకడమ్ కష్టమే! ఈ రాజకీయ తుఫాను గాలులను ఎవరు ఎలా నియంత్రిస్తారో ఎలా తట్టుకుంటారో చూడాలిక.