సీఎం జగన్‌కు మరిన్ని కష్టాలు తప్పవా..!

Wed Dec 01 2021 17:36:22 GMT+0530 (IST)

AP CM Jaganmohan Reddy in dire straits

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుస కష్టాలతో విలవిల్లాడుతోన్న పరిస్థితి. మూడు రాజధానులు అతీ గతీ లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం.. రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతోన్న వ్యతిరేకత.. అభివృద్ధి నిల్.. ఇలా చాలా సమస్యల్లో జగన్ చిక్కుకుపోయారు. ఏపీలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు రావడం ఎప్పుడో మానేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకే బిల్లులు కాలేదు. మరోవైపు మూడు రాజధానుల బిల్లు రద్దు చేయడం ఏపీ సీఆర్డీయే చట్టం కూడా రద్దు చేయడం కూడా కొన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీకి రాజధాని లేకపోవడంతో అసలు పెట్టుబడులు రావడం లేదు.ఇక జగన్ మండలిని రద్దు చేస్తున్నట్టు యేడాదిన్నర క్రితం చేసిన తీర్మానం కూడా ఇప్పుడు ఉప సంహారించుకున్నారు. దీంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ?  కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు.
మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రకు విశేషమైన స్పందన లభిస్తోంది. పాదయాత్ర కొనసాగుతున్న ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరీ వారికి మద్దతు ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా పాదయాత్ర సక్సెస్‌కు కారణంగానే చెప్పాలి.

వైసీపీ మంత్రులు పాదయాత్రలో పాల్గొన్న వారిని పెయిడ్ ఆర్టిస్టులు టీడీపీ నేతలు అని విమర్శిస్తున్నా జనాల్లో మాత్రం పాదయాత్ర విషయంలో సానుభూతే ఉంది. మరో వైపు పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయకపోవడం సిఫార్సులను అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా ప్రభుత్వంపైనే పోరాటానికి రెడీ అవుతున్నాయి. పీఆర్సీపై రెండు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు డిసెంబర్ 7 నుంచి సమ్మెకు దిగుతున్నాయి.

డిసెంబర్ 1నుంచే ఈ  సంఘాలు ప్రధాన కార్యదర్శికి వినితిపత్రం అందజేస్తాయి. ఆ తర్వాత ఆందోళనలకు దిగుతారు. ప్రభుత్వ ఉద్యోగుల నిరసన ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇక వరదలు  నిధుల కొరత కారణంగా ఏ పని చేయడం లేదు. కేంద్రానికి ఇక్కడ బాధలపై లేఖలు రాస్తున్నా స్పందన లేదు. ప్రతిపక్షాల దాడి పెరుగుతోంది. ఇక  మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ప్రభుత్వ పనితీరు బాగోలేదని చర్చించు కుంటున్నారు.

ఇక వచ్చే ఆరు నెలల్లో నిధుల కొరతతో మరీ కటకటలాడే పరిస్థితి వస్తుందని అంటున్నారు.  ఏదేమైనా జగన్ కష్టాల ఊబిలో అయితే చిక్కుకున్న పరిస్థితే ఉంది.