ఒకప్పటి ఏపీని తలపిస్తున్న ఆప్.. 'సంపన్న పేదలు'!

Thu Sep 29 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

AAP targeting AP.. 'rich and poor'!

పేదల పక్షాన ఉంటాం.. వారి హక్కులు కాపడతాం.. అని పదే పదేచెప్పే.. ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ.. వ్యవహారం ఇప్పుడు బజారున పడింది. ఒకరి తర్వాత.. ఒకరుగా.. ఆ పార్టీ నాయకులు.. విమర్శల పాలవుతూ.. పార్టీ పరువును బజారున పడేస్తున్నారు.ప్రస్తుతం ఈ పార్టీ ఢిల్లీ సహా పంజాబ్‌లోనూ అధికారంలో ఉంది. అయితే.. ఇప్పుడు ఈ పార్టీలో రేషన్ కార్డు ఉన్న సంపన్నలు.. రేషన్ దుకాణాలకు వస్తున్నారు.

అదేంటి అనుకుంటున్నారా. నిజానికి పేదలకు అందాల్సిన రేషన్ కార్డులు.. ఆప్ ఏలుబడిలోనూ.. సంపన్నులకు అందాయన్నమాట.  ఒకప్పుడు.. ఉమ్మడి ఏపీలో వైఎస్ పాలనలోనూ.. సంపన్నులు పోటీ పడి రేషన్ కార్డులను దక్కించుకున్నారు.

దీనికి కారణం.. ఆరోగ్య శ్రీ వైద్యం. రేషన్ కార్డు ఉన్నవారికి.. ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. రేషన్‌కార్డు కోసం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఎంపీలు కూడా పెడదోవలు తొక్కారు.

ఇక తాజాగా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత.. ఖరీదైన కారులో వచ్చి రేషన్ దుకాణంలో సరకులు తీసుకున్నారు. ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గంలోని ధుందన్ గ్రామ పంచాయతీ సభ్యుడు జగ్దీప్ సింగ్ రంధవా.. పీడీఎస్ షాప్ నుంచి గోధుమ సంచులను తన కారులోకి ఎక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మజిందర్ సింగ్ లాల్పుర స్పందించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఎదైనా తప్పు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. పంజాబ్లోని హోషియాపుర్లోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. బీపీఎల్ కార్డు ఉన్న ఓ వ్యక్తి ఆడీ కారులో వచ్చి సరకులు తీసుకెళ్లాడు. దీనిపై ఆ రాష్ట్రంలో దుమారం చెలరేగింది. రేషన్ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే చర్చ మొదలైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.