నడిరోడ్డు మీద యువతిని కాల్చి చంపిన యువకుడు!

Fri Sep 30 2022 22:52:43 GMT+0530 (India Standard Time)

A young man shot dead a young woman on the road

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా ఆడ పిల్లల మీద అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. పటిష్టమైన నిర్బయ పోక్సో చట్టాలు తెస్తున్నా ఈ దారుణాలకు అంతూపొంతూ ఉండటం లేదు. తాజాగా ఓ యువకుడు తనను ప్రేమించడం లేదనే కారణంతో తన స్నేహితురాలైన యువతిని నడిరోడ్డు మీద కాల్చి చంపాడు. ఈ దారుణం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ గార్ జిల్లాలోని బోయ్స్ర్ లో క్రిష్ణ యాదవ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో ఉంటున్న నేహా మెహతో అనే యువతితో ఇతడికి స్నేహం ఉంది. ఎంతో కాలం నుంచి ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్నారు.

ఈ క్రమంలో తన స్నేహితురాలిపై కృష్ణా యాదవ్ మనసు పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లాడు. తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుందాం అని కోరాడు. అయితే నేహా మెహతో తన స్నేహితుడు కృష్ణా యాదవ్‌కు ప్రపోజల్‌కు నో చెప్పింది. తన మీద స్నేహితుడనే అభిప్రాయం తప్ప మరేం లేదని తెలిపింది. అంతేకాకుండా అతడు ఈ ప్రపోజల్ తెచ్చినప్పటి నుంచి అతడిని తన నుంచి దూరంగా పెట్టింది. అంతకుముందులాగా స్నేహంగా ఉండటం లేదు.

ఇది మనసులో పెట్టుకున్న కృష్ణా యాదవ్..  రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెతో మాట్లాడటానికి వెళ్లాడు. నీతో మాట్లాడాలని పక్కకు రావాలని కోరాడు. దీనికి ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణా యాదవ్ తనతోపాటు తెచ్చుకున్న కంట్రీ మేడ్ రివాల్వర్‌తో ఆమెను కాల్చిచంపాడు.  దీంతో ఆ యువతి అక్కడికక్కడే మరణించింది. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

నేహాను చంపేశాక కృష్ణా యాదవ్‌కు భయం పట్టుకుంది. పోలీసులు తనను శిక్షిస్తారనుకున్న అతడు నేహాను కాల్చిచంపాక అటుగా వెళ్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) వాహనం కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులు హుటాహుటిన అతడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని తెలిపారు.

నేహా మెహతాను నడిరోడ్డు మీద కాల్చి చంపడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్వాధీనం చేసుకుని పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా హత్యకు ఉపయోగించిన కంట్రీ మేడ్ రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.