Begin typing your search above and press return to search.

డబుల్ పీజీ చేసింది ... యూనివర్సిటీ లో రోల్ మోడల్ ...ప్రస్తుతం భిక్షాటన చేస్తుంది !

By:  Tupaki Desk   |   20 Oct 2020 3:10 PM GMT
డబుల్ పీజీ చేసింది ... యూనివర్సిటీ లో రోల్ మోడల్ ...ప్రస్తుతం భిక్షాటన చేస్తుంది !
X
కాలం మార్చిన కథ అంటే ఈ కథకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. డబుల్ పీజీ చేసింది , ఆమె యూనివర్సిటీ లో విద్యార్థులందరికీ ఓ రోల్ మోడల్..కానీ , ప్రస్తుతం బిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. ఉత్తరాఖండ్‌ లోని కుమావున్ యూనివర్సిటీ ప్రాంగాణం ఒకప్పుడు హన్సీ ప్రహరి పేరుతో ప్రతిధ్వనించేది. ఆమె వాగ్దాటికి ఉపరాష్ట్రపతిని సైతం ఆకర్షితుడైయ్యాడు. పాలిటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో రెండుసార్లు పీజీ చేసింది. అంతేగాక డబుల్ ఎంఎ. ఆమెతో ఇంగ్లీషులో మాట్లాడాలంటే ఎవరైనా తడబడాల్సిందే. అంత అనర్గలంగా మాట్లాడటం ఆమె సొంతం. క్యాంపస్ లో ఆమె హాజరు కాకుండా మీటింగులు కూడా జరిగేవి కావు. కుమావున్ లో డబుల్ పీజీ చేసిన హన్సీ ప్రహారి అక్కడే విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు. ఆమె జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని అందరూ భావించారు. కానీ కాలం ఆమె జీవిత స్క్రీన్ ప్లే ను మరో విధంగా మార్చింది. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందనుకున్న ఆమె ప్రస్తుతం యాచకురాలిగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా సోమేశ్వర్ కు సమీపాన ఉండే రాంఖిలా గ్రామం హన్సీ ప్రహరి సొంతూరు. ఐదుగురు తోబుట్టువులలో ఆమె పెద్ద కుమార్తె. చిన్నతనం నుండే చదువులో చురుకుగా ఉండే హన్సి చదువు గురించి గ్రామంలో చర్చించేవారు. ఆమె తండ్రి చిరుద్యోగి. చాలా కష్టాలకోర్చి పిల్లలను చదివించాడు. తండ్రి కష్టాలను ప్రత్యక్షంగా చూసిన హన్సి.. ఊరి నుంచి కుమావున్ విశ్వవిద్యాలయానికి చేరింది. ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఆమె యూనివర్సిటీలోకి చేరడంతో ఆమెపై ప్రతి ఒక్కరికి అంచనాలు పెరిగాయి. అక్కడ ఆమె కొన్నాళ్లపాటు స్టూడెంట్స్ యూనియన్ ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. అలాగే మరిన్ని పదవుల్ని ఆమె చేపట్టి తన ప్రత్యేకత చాటుకుంది.

అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో.. 2011 తరువాత, హన్సీ ప్రహరి జీవితం అకస్మాత్తుగా మారిపోయింది. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అజయ్‌ టమ్‌టాకు వ్యతిరేకంగా ఆమె ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. తర్వాత పెళ్లి చేసుకున్న ఆమె.. గొడవలు కారణంగా జీవితం మారిపోయింది. వైవాహిక జీవితంలో గందరగోళం తరువాత, హన్సీ ప్రహరి కొంతకాలం నిరాశకు గురైంది. తర్వాత ధర్మనాగ్రిలో స్థిరపడి హరిద్వార్ చేరుకుంది. అప్పటి నుంచి, కుటుంబం నుంచి విడిపోయి.. తన కొడుకుతో కలిసి బతుకుతున్నది. ఆమె శారీరక పరిస్థితి కూడా బాగాలేకపోవడంతో ఎక్కడా ఉద్యోగం చేయలేదు. తనకు సాయం చేయాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదు. ఒకప్పుడు ఎంతో ప్రతిభను చాటుకున్న ఆమె ఇప్పుడు ఈ పరిస్థితిలోకి రావడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

2012 నుంచి ఆమె తన ఆరేళ్ల బిడ్డతో కలిసి హరిద్వార్ ‌లో బిక్షాటన ద్వారా జీవనం కొనసాగిస్తుంది. టైం ఉన్నప్పుడల్లా, ప్రహరి తన కొడుకు కు ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం మరియు అన్ని భాషలను చెప్తుంది. విధి వక్రీకరించిన ఆమె జీవితంలో మిగిలి ఉన్న ఏకైక కోరిక కోరిక ఏమిటంటే, ఆమె కొడుకు బాగా చదువుకోవడం. దీనికోసం తనకు సహాయం చేయమని ఆమె స్వయంగా సీఎంకి అనేక సార్లు లేఖలు రాసింది. సచివాలయం చుట్టూ తిరిగింది. కానీ సహాయం అందలేదు ప్రభుత్వం సహాయం చేస్తే, ఆమె పిల్లలకు మంచి చదువు అందించాలని కోరుకుంటుంది.