Begin typing your search above and press return to search.

ప్లాస్మా ఇస్తాం అంటూ ఘరానా మోసం ... కేటుగాళ్లతో జాగ్రత్త !

By:  Tupaki Desk   |   16 July 2020 2:30 AM GMT
ప్లాస్మా ఇస్తాం అంటూ ఘరానా మోసం ... కేటుగాళ్లతో జాగ్రత్త !
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకొని దాన్ని నుండి బయటపడటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే తప్ప ..ఈ క్లిష్ట సమయాన్ని ఎదుర్కోలేము. మానవజాతి అంతానికి ప్రతిరూపంగా నిలుస్తున్న ఈ మహమ్మారి పోరులో విజయం సాధించాలంటే ఉమ్మ‌డి పోరు తప్పనిసరి. దానికి తగ్గట్టుగానే కరోనా సోకి , ఆ తర్వాత కరోనాకి చికిత్స తీసుకోని కోలుకున్న తరువాత ఆ రోగులు ప్లాస్మా ను ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇలా కరోనా నుండి కోలుకున్న తరువాత ప్లాస్మా ఇస్తూ మరొకరి జీవితం నిలబడటానికి తోడ్పడుతున్నారు.

అయితే , కొంతమంది మాత్రం దీన్ని కూడా తమకి అనుకూలంగా మార్చుకొని డబ్బు గుంజుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్లాస్మా ఇవ్వడానికి మేము సిద్ధం అని , అయితే మా దగ్గర ప్రయాణ ఖర్చులకి డబ్బు లేదు అని చెప్పి ..డబ్బు తమ అకౌంట్ లోకి వేపించుకొని , ఆ తరువాత సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. ఈ మధ్య హైదరాబాద్ కి చెందిన ఓ మహిళ త‌న కుటుంబ సభ్యుడి కోసం ప్లాస్మా డోనేట్ చేసే వారు కావాలి అని సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. ఆ పోస్ట్ కి సందీప్ రెడ్డి అనే ఐడీ పేరుతో రిప్లై వచ్చింది. మీకు ప్లాస్మా ఇవ్వడానికి నేను సిద్దమే అని , అయితే నేను ఉన్న చోటునుండి అక్కడికి రావడానికి దారి ఖర్చులకి కొంత డ‌బ్బు అకౌంట్ లో వేయాలని తెలిపాడు. దీనితో అది నిజమే అని నమ్మినవారు అతను చెప్పినట్టే దారి ఖర్చుల కి 2,500 రూపాయ‌ల డబ్బు అతడికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ తరువాత కాసేపటికి మళ్లీ కాల్ చేసి ఆ డబ్బు ఏవో కారణాలవల్ల కట్ అయ్యాయని , మళ్లీ డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని కోరాడు. దానితో మళ్లీ వారు డబ్బుని అతని అకౌంట్ లో వేశారు. ఆ త‌ర్వాత‌ అత‌డి నుంచి ఎటువంటి రిప్లై లేదు. క‌రోనా మహమ్మారి విజృంభిస్తున్న చేస్తోన్న ఇలాంటి స‌మయంలో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. మ‌నుషుల జీవితాలే పెట్టుబ‌డిగా మోసాల‌కు తెగ‌బ‌డుతున్నారు కేటుగాళ్లు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.