Begin typing your search above and press return to search.

ఆంటీతో ముగ్గురి శృంగారం.. నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్?

By:  Tupaki Desk   |   9 July 2020 1:30 AM GMT
ఆంటీతో ముగ్గురి శృంగారం.. నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్?
X
పెళ్లై భర్తతో విబేధాలు వచ్చి ఓ ఆంటి విడిపోయింది.. ఒంటరిగా ఉంటోంది. బాగా ఆస్తిపరురాలు.. మొబైల్ రీచార్జ్ కోసం స్థానికంగా ఉన్న ఒక నెట్ కేఫ్ కు వస్తుండేది. ఆమెపై కన్నేసిన కేఫ్ యజమానులైన సోదరులు, అందులో పనిచేసేవాడు ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరు ఆంటీకి గాలమేశారు.. లోబరుచుకున్నారు. రాసలీలలు చేస్తూ ఎంజాయ్ చేశారు. అందులో ఒకడు నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో వీరి బండారం బయటపడింది. ఆ ఆంటీ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.

తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఏర్వాడిలో నివాసం ఉంటున్న 45 ఏళ్ల మహిళ ఒంటరిగా ఉంటోంది. ఏర్వాడి ప్రాంతంలోనే నివాసం ఉంటున్న షాదుషా (35), హాజీ (32) అనే సోదరులు ఇంటర్నెట్ కేఫ్ తోపాటు మొబైల్ షోరూం నిర్వహిస్తున్నారు. వీరి కేఫ్ లోనే సహాబుద్దీన్ (40) అనే వ్యక్తి పనిచేస్తున్నాడు.

మొదట సోదరులు షాదుషా, హాజీలు ఒకరికి తెలియకుండా ఒకరు ఆంటీతో ఎఫైర్ పెట్టుకొని ఎంజాయ్ చేశారు. అనంతరం వదిలేశారు. ఈ విషయం తెలిసిన సహాబుద్దీన్ తాను వాళ్లలా వదిలేయనని.. వివాహం చేసుకుంటానని ఆమెతో రాసలీలలు సాగించాడు. ఓ రెండు నెలల పాటు ఎంజాయ్ చేశారు. నగ్న వీడియోలు, ఫొటోలు శృంగారం సమయంలో తీశాడు.

ఆ తర్వాత పెళ్లిచేసుకోవాలని ఆంటీ కోరగానే సహాబుద్దీన్ ప్లేట్ ఫిరాయించాడు. నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానని రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. తాను ఇవ్వనని ఆంటీ చెప్పడంతో ఫ్రెండ్స్ కు, అమెరికాలో స్నేహితులకు, సోషల్ మీడియాలో ఆ నగ్న వీడియోలు షేర్ చేశాడు. ఆ వీడియోలు ఆంటీ కంటపడి బంధువులు తిట్టడంతో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ముగ్గురు కామాంధులను అరెస్ట్ చేసి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.