ఓకే కాన్పులో 10మందికి జన్మనిచ్చిన మహిళ

Wed Jun 09 2021 08:00:01 GMT+0530 (IST)

A woman who gave birth to 10 children in one birth

ఒకరిద్దరిని కనడానికే మన మహిళలు ఆపసోపాలు పడుతున్న మన మహిళలు షాక్ అయ్యేవిషయం ఇదీ. దేశంలో నలుగురు ఐదుగురిని కన్న మహిళలున్నారు. అయితే ఒకరు ఇద్దరు ఐదుగురు కాదు.. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళకు 10 మంది పిల్లలు పుట్టారు. ప్రపంచంలోనే ఇదో పెద్ద రికార్డ్ అని చెప్పొచ్చు.తొలుత స్కానింగ్ లో ఆమె కడుపులో ఆరుగురు ఉన్నారని తేలింది. ఆ తర్వాత రిపోర్టులను పరిశీలిస్తే 8మంది పిల్లలున్నారని తేలింది. అయితే వైద్యుల రిపోర్టులను కూడా తోసిరాజని ఆ మహిళ ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనివ్వడం విశేషం. ఒకేసారి అంతమంది పిల్లలకు జన్మనివ్వడం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు.

దక్షిణాఫ్రికాలో ప్రిటోరియా నగరానికి చెందిన గోసియామి తమారా సితోలే అనే 37 ఏళ్ల మహిళకు ఏడుగురు మగ పిల్లలు.. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మే నెలలో మొరాకోకు చెందిన మహిళ 9మంది పిల్లలకు జన్మనివ్వడమే ఒక రికార్డ్. ఇప్పుడు సితోలే ఆ రికార్డును అధిగమించారు.

సితోలే రిటైల్ స్టోర్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. గతంలోనే ఈమెకు ఇద్దరు కవలలు జన్మించారు. పుట్టిన పది మంది పిల్లలు కూడా ఆరోగ్యంగానే పుట్టారని.. కాకపోతే ఇంక్యూబేషన్ లో ఉంచారని ఆమె భర్త మీడియాకు తెలిపారు.