Begin typing your search above and press return to search.

ఏడాదిగా మైనర్ బాలుడ్ని అత్యాచారం చేస్తూనే ఉందట

By:  Tupaki Desk   |   7 March 2021 1:30 AM GMT
ఏడాదిగా మైనర్ బాలుడ్ని అత్యాచారం చేస్తూనే ఉందట
X
విపరీతాలకు సంబంధించి వార్తలు చాలానే బయటకు వస్తున్నాయి. దారుణాలకు ఆడ.. మగ అన్న తేడా లేకుండా పోయింది. గతంలో బాధితులంతా ఒక తరహాలో.. బాధ్యులు మరో తరహాలో ఉండటం ఉండేది. ఇప్పుడా రేఖ చెరిగిపోయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా చెప్పే ఉదంతం ఈ కోవకు చెందిందే. అమెరికాకు చెందిన ఒక మహిళ ఆరాచకం తెలిస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ విపరీతం ఏందిరా బాబు అంటూ షాక్ తినాల్సిందే.

అర్కాన్సాస్ ప్రాంతానికి చెందిన బ్రిగ్ని గ్రే అనే మహిళ ఏడాదిగా పద్నాలుగేళ్ల మైనర్ బాలుడితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంది. తన కంటే ఎంతో చిన్నవాడైన అతడిని తరచూ అత్యాచారానికి పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. పద్నాలుగేళ్ల బాలుడితో శారీరక సంబంధం నెరుపుతున్నట్లుగా బయటకు వచ్చింది.

గత ఏడాది సెప్టెంబరులో ఒక వ్యక్తి ఈ విషయంపై సమాచారం ఇవ్వటంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. దీంతో సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు బ్రిట్ని ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతుననారు. విచారణలో బ్రిట్ని తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. ఏడాది నుంచి మైనర్ బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్న విషయాన్ని ఆమె అంగీకరించినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఆమె రెండు నెలల గర్భవతిగా తెలిపినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ నెల ఆమెను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించగా.. 5వేల డాలర్ల పూచికత్తు మీద విడుదలయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 23న కోర్టు ముందుకు రానుంది. మరి.. దీనిపై కోర్టు ఏ తీరులో స్పందిస్తుందో చూడాలి. అయితే ఈ ఎపిసోడ్ లో.. బాధిత బాలుడి వెర్షన్ బయటకు రాలేదు.