తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ కు తెర తీసేలా మారిన వైరల్ వీడియో

Thu Jun 17 2021 21:00:01 GMT+0530 (IST)

A viral video that has become a screen for the new trend in Telugu states

ఒక చిట్టి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినోళ్లంతా ఒకటికి రెండుసార్లు చూడటమే కాదు.. తెలిసిన వారికి విపరీతంగా ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న కాన్సెప్టు.. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో  సరికొత్త ట్రెండ్ గా మారుతుందనటంలో సందేహం లేదంటున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏమున్నదంటే.. అప్పుడే పెళ్లై.. అత్తారింటికి వచ్చిన కొత్త కోడలికి స్వాగతం పలుకుతూ.. పూలు జల్లటమే కాదు.. స్వయంగా ఎదురెళ్లిన అత్తగారు.. కొత్త కోడలు ఎక్కే ప్రతి మెట్టుకు ఒక బహుమతిని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు బయటకు రానప్పటికీ.. కొత్త కోడలికి అత్తారింటికి వచ్చిన తొలిసారి స్వాగతం పలికిన తీరు వినూత్నంగా ఉండటమే కాదు.. అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది.తమ కుమార్తెకు ఇలాంటి అత్తగారు దొరకాలని అనుకునేలా ఈ వీడియో ఉంది.

పెళ్లి చేసుకొని.. ఇంటికి వచ్చిన కోడల్ని మేడ మీద ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లేందుకు.. అత్తగారు పెద్ద సంచిని చేతికి పెట్టుకోవటం వీడియోలో కనిపిస్తుంది. ఒక మెట్టుకు కొత్త నోట్ల కట్ట ఇవ్వటం.. మరో మెట్టు ఎక్కే టప్పుడు వెండి వస్తువు ఇవ్వటం కనిపిస్తుంది. ఇలా ప్రతి మెట్టుకు ఒక బహుమతిని ఇస్తూ స్వాగతం పలికిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో వాట్సాప్ లో వైరల్ గా మారి హడావుడి చేస్తుంది. ఈ వీడియో పుణ్యమా అని.. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కొత్త కోడలిని స్వాగతం పలికే విధానంలో ఈ తరహా ట్రెండ్ ఖాయమన్న మాట వినిపిస్తోంది.