Begin typing your search above and press return to search.

హాస్పిటల్ లో ‘మాక్ డ్రిల్’ కేసులో ట్విస్ట్ ..మరణాలకి అసలు కారణం అది కాదట !

By:  Tupaki Desk   |   19 Jun 2021 9:30 AM GMT
హాస్పిటల్ లో ‘మాక్ డ్రిల్’ కేసులో ట్విస్ట్ ..మరణాలకి అసలు కారణం అది కాదట !
X
ఏప్రిల్‌ లో ఆగ్రాలోని ప్రైవేటు ఆసుపత్రిలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించే సమయంలో ఆక్పిజన్‌ నిలిపివేయడంతో సుమారు 16 మంది చనిపోయిన ఘటనలో సదరు ఆసుపత్రికి యూపీ ప్రభుత్వం క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఏప్రిల్ 27 న ఈ ఆసుపత్రి యజమాని రోగులకు 5 నిముషాలపాటు ఆక్సిజన్ ఆపివేస్తే ఎలా ఉంటుందో చూద్దామని మాక్ డ్రిల్ ప్రయోగం చేశాడని ఆ మధ్య ఓ ఆడియో క్లిప్ సంచలనం రేపింది. ఆ రోజున 16 మంది రోగులు మృతి చెందారని, కానీ వారి మృతికి ఇది కారణం కాదని ఓ కమిటీ తెలిపింది. ఈ షాకింగ్ ఉదంతంపై విచారణకు యూపీ ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. వీరంతా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ...పరిస్థితి విషమించి చనిపోయినట్లు కమిటీ పరిశోధకులు రిపోర్టు అందించారు.

కాగా, ఆ సమయంలో ఆసుప్రతి యజమాని చేసిన వ్యాఖ్యల వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేసిన సంగతి విదితమే. ఆక్సిజన్‌ తీసి ఎంత మంది బతుకుతారో చస్తారో చూడండని ఆయన చేసిన వ్యాఖ్యలు బహిర్గతమైనప్పటికీ, యుపి సర్కార్‌ కమిటీ క్లీన్‌ చిట్‌ ఇవ్వడం పలు అనుమానాలకు తావునిస్తోంది. కమిటీ నివేదికలో 16 మందిలో 14 మంది అంతకు ముందు నుండి వెంటాడుతున్న అనారోగ్య సమస్యలతో చనిపోగా, మిగిలిన ఇద్దరు. చెస్ట్‌ లో ఇన్‌ ఫెక్షన్‌ అయి చనిపోయారని తెలిపింది. అందరినీ కోవిడ్‌ ప్రోటోకాల్‌ ననుసరించి చికిత్స అందించారని, వీరిలో ఎవరూ కూడా ఆక్సిజన్‌ నిలిచిపోవడం వల్ల చనిపోలేదని కమిటీ పేర్కొంది. మరణించిన 16 మందిలో ఏడుగురి బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదులను నివేదికలో చేర్చలేదు.

శ్రీ పరాస్ అనే హాస్పిటల్ యజమాని అరింజయ్ జైన్, ఈ ప్రయోగం చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఆక్సిజన్ సిలిండర్లు అన్నీ రిజర్వ్ లో ఉన్నాయని, ఈ ప్రాణవాయువు కొరత లేదని, తమ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగులకు ఇది సరిపోతుందని జైన్ చెప్పినట్టు తెలిసింది. ఆక్సిజన్ నిలిపివేసినందున పేషంట్స్ మరణించారనడం నిజం కాదని పేర్కొన్నట్టు సమాచారం. అసలు ఆ డియో క్లిప్ లో తాను అలా అనలేదని, అసలు ఇందులో తన తప్పేమీ లేదని జైన్ చెప్పాడట, కాగా ఈ 16 మంది రోగుల కుటుంబాల్లో ఏడుగురి కుటుంబాల ఫిర్యాదులను ఈ కమిటీ తమ నివేదికలో ప్రస్తావించలేదు. శ్రీపరాస్ హాస్పిటల్ తీరుపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు దీన్ని కొన్ని రోజులపాటు సీల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తెరిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.