జగన్ సర్కారుకు చుట్టూ ఉచ్చు.. ఏం జరుగుతోందంటే..!

Sat May 15 2021 13:09:06 GMT+0530 (IST)

A trap around the Jagan government

ప్రస్తుతం కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఏపీ ప్రభుత్వం చుట్టూ.. ఉచ్చుబిగుస్తోందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాపై పోరులో.. ఏపీని ఒంటరిని చేసే వ్యూహం ఏదైనా ఉందా ? అనే చర్చ రాజకీయంగా పెద్ద ఎత్తున జరుగుతోంది. కేంద్రం నుంచి ఎలాంటి సాయం పెద్దగా అందడం లేదు. మేం డబ్బులిస్తా.. మీరు వ్యాక్సిన్ ఇవ్వండి.. అని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా.. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో ఆక్సిజన్ విశాఖలో ఉత్పత్తి అవుతున్నా.. ఏపీకి కేటాయింపులు లేకుండా చేశారు.కానీ ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ వ్యాక్సిన్‌ల విషయంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు కనీసం సమాచారం ఇచ్చిన తర్వాత.. ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. తెలంగాణ మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్‌లను ఆయా రాష్ట్రాలకు చెప్పి తీసుకువెళ్తున్నారు.కానీ ఆక్సిజన్ ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ఏపీలోనే ఉన్నా.. ఇక్కడ నుంచి రోజులు పదుల సంఖ్యలో ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా.. కేంద్రం ఏపీ సర్కారుకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అదే సమయంలో రెమ్‌డిసివర్ ఇంజన్ల కేటాయింపు వ్యాక్సిన్ల కేటాయింపు వంటివిషయాల్లో కూడా కేంద్రం సహకరించడం లేదు.

ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే.. ఏపీని కరోనా విషయంలో బద్నాం చేయాలనే ఒక కుట్ర తెరవెనుక ఉందనే వాదన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది!. గత ఏడాది కరోనా తొలి దశలో.. ఏపీ సమర్ధంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం కూడా ఏపీని ప్రశంసించింది. అయితే.. బీజేపీ ఇక్కడ పునాదులు పదిలంగా ఉంచుకోవాలంటే.. ఏపీలో బలంగా ఉన్న జగన్‌స ర్కారును ఏదో ఒకరకంగా.. ప్రజల్లో చుకలన చేయడం సహా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.. అనే వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రధానం.

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్.. బీజేపీ ప్రభుత్వానికి కలిసి వచ్చిందని అంటున్నారు. అందుకే కరోనా విషయంలో ఇతర రాష్ట్రాలకు ఒక విధంగా.. ఏపీకి మరో విధంగా కేంద్రం సహకారం ఇస్తోందనే వాదన కూడా ఉంది. మరి దీనిని జగన్ ఛేదిస్తారో.. ఇంకా ఉచ్చులో బిగుసుకుపోతారో చూడాలి.