Begin typing your search above and press return to search.

6 గజాల్లో మూడంతస్తుల ఇల్లు ... అతి త్వరలో మాయంకాబోతుంది , ఎందుకు ?

By:  Tupaki Desk   |   26 Nov 2020 2:30 AM GMT
6 గజాల్లో మూడంతస్తుల ఇల్లు ... అతి త్వరలో మాయంకాబోతుంది , ఎందుకు ?
X
దేశంలో జనాభా రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నారు. దీనితో స్థల అవసరం కూడా భారీగా పెరుగుతుంది. ఒకప్పుడు విశాలంగా ఉండే ఇల్లు ఉండేవి. పైగా దానికి వాకిలి, పెరడు, కొంత ఖాళీ స్థలం ఉండేవి. కానీ మెల్ల మెల్లగా అవి కనుమరుగైపోయాయి. అయితే విశాలమైన ఇళ్ళు ఇప్పటికీ పల్లెటూర్లలో ఉన్నప్పటికీ సిటీల్లో మాత్రం అలంటి ఇల్లుల్లు కనపడటం గగనం. చిన్న ఖాళీ స్థలంలోనే అంతస్తుల మీద అంతస్తులు కట్టేస్తున్నారు. ఢిల్లీలో ఒకతను మాత్రం కేవలం 6 గజాల్లోనే మూడంతస్తుల భవనం నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్థలాల రేటు పెరిగిపోవడం తో తనకున్న ఆరు గజాల స్థలంలోనే ఏడేళ్ల క్రిందట ఏకంగా మూడు అంతస్థుల అందమైన భవనాన్ని తక్కువ ఖర్చుతో నిర్మించేశాడు. ఢిల్లీలోని బురాడీలో నిర్మితమైన ఈ వింత ఇల్లుని చూసేందుకు చుట్టపక్కల జనం ఎగబడతారు.

అయితే , ఆ బుజ్జి ఇల్లుని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీనితో ఈ ఇల్లు ఇక అతి త్వరలోనే మాయం కాబోతుంది. కానీ అంత చిన్న స్థలంలో అంత పొడుగు ఇంటిని నిర్మించిన ప్లానర్‌ను అభినందించాల్సిందేననే వారు ఆ ఇంటిని చూసినవారంతా.ఈ ఆరు గజాల్లో కట్టిన ఈ మూడు అంతస్తులు ఇంట్లో బెడ్ రూమ్, కిచెన్, బాత్రూమ్, టెర్రస్, చిన్న మెట్లు అంతా వెరైటీయే..ఇంటిలో ఫ్లోరింగ్ పాలరాతితో నిర్మించారు. ఆ ఇంటిలో భార్యా భర్త ,ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు. కాగా,భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘిస్తూ, నిర్మించిన ఈ ఇంటిని కూలగొట్టాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ ఇల్లు చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు ప్రమాదకరంగా మారిందని అధికారులు భావించి , ఆ ఇంటిని కూల్చివేయాలని నిర్ణయించింది. ఓఇల్లు నిర్మించాలంటే కనీసం 32 చదరపు అడుగుల స్థలం అవసరముంటుందనీ..కానీ కేవలం ఆరు గజాల్లో మాత్రమే కట్టిన ఈ ఇంటి నిబంధనలకు అతీతమని ఎంసీడీకి చెందిన ఇంజినీరు ఒకరు తెలిపారు.ఇటువంటి ఇళ్లకు ఎప్పటికీ అనుమతి దొరకదు అని అన్నారు.