నడిరోడ్డుపై ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఘోర అవమానం

Wed Jun 09 2021 07:00:01 GMT+0530 (IST)

A terrible insult to the President of France on the road

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కు ఘోర అవమానం ఎదురైంది. దేశవ్యాప్త పర్యటనలో ఉన్న మాక్రాన్ పై ఓ ఆగంతకుడు చెంప పగులకొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం మాక్రాన్ ఆగ్నేయ ఫ్రాన్స్ లో పర్యటించారు. మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు డ్రోమ్ ప్రాంతంలోని టైన్ ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఓ ఉన్నత పాఠశాలను సందర్శించి కారు దగ్గరకు వెళ్లాడు మాక్రాన్.

అక్కడ ఉన్న జనాలు మాక్రాన్ ను పిలవడంతో ఆయన తిరిగి వెనక్కి వచ్చాడు. బారికేడ్ల వెనుక ఉన్న జనాలను పలకరించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న 43 ఏళ్ల వ్యక్తికి మాక్రాన్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

ఇంతలో  సదురు ఆగంతకుడు వెంటనే తన చేతిని వెనక్కి తీసుకొని మాక్రాన్ చెంప పగులకొట్టాడు.  దాంతో అంత దూరాన పడ్డాడు అధ్యక్షుడు. అనుకోని ఈ సంఘటనకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇంతలో మాక్రాన్ బాడీ గార్డులు వచ్చి ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు.