Begin typing your search above and press return to search.

దోమలు రక్తం రుచి చూసి , నచ్చితేనే పిలుస్తాయట !

By:  Tupaki Desk   |   18 Oct 2020 12:30 AM GMT
దోమలు రక్తం రుచి చూసి , నచ్చితేనే పిలుస్తాయట !
X
దోమలు ..ఈ దోమల వల్ల అందరూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ముఖ్యంగా పడుకున్న సమయంలో ఈ దోమలు చికాకు తెప్పిస్తుంటాయి. దోమల భారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దోమలు మాత్రం తమ పని చేసుకొని వెళ్లిపోతాయి. దోమల భాద తప్పించుకోవడానికి పలు రకాల స్ప్రేలు కాయిల్స్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ అవి పూర్తిస్థాయిలో దోమలను మాత్రం నియంత్రించడం లేదనే చెప్పాలి. ఇక కొన్ని కొన్ని సీజన్లలో అయితే దోమల బెడద మరింత ఎక్కువైపోతుంది. మనుషుల రక్తాన్ని పీల్చుతూ అవి ఆనందపడుతుంటాయి.

ఒకరకంగా ఎక్కువ దోమలు కుట్టడం అంటే హింస అనే చెప్పాలి. ఇక ఇలా దోమల బెడద మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఇక ముఖ్యంగా వర్షాకాలంలో దోమలు ఈగల బెడద ఎక్కువగా ఉంటుంద. అయితే కాస్త అప్రమత్తంగా లేకపోయినా దోమలు కుట్టి రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి. అయితే, దోమలు కేవలం కొంతమంది మాత్రమే ఎక్కువగా కుడుతూ ఉంటాయి. కొంతమంది జోలికి అసలు వెళ్లవు . దీనితో చాలామంది దోమలకి నీ రక్తమే ఎందుకో బాగా నచ్చినట్టు ఉంది. అందుకే ప్రతిసారి నిన్నే కుడుతున్నాయి అని అంటుంటారు. ఆ సమయంలో నవ్వుతూ అన్నప్పటికీ అదే నిజం. అంటే దోమలు రక్తం రుచి చూసి కుడతాయా అంటే అవుననే చెప్పాలి.

ఇకపోతే , ఈ మద్యే మనుషులను దోమలు ఎందుకు కుడతాయి అనే అంశంపై అధ్యయనం చేపట్టగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. న్యూయార్క్ లోని రాక్ఫెల్లర్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో దోమలను కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే రక్తాన్ని పీల్చవు అన్న విషయం వెలుగులోకి వచ్చింది అని పరిశోధకులు తెలిపారు. దోమ కడుపులో ఉన్న గుడ్లకు పోషకాలను అందించే రక్తాన్ని ఎక్కువగా దోమలు పిలుస్తుంటాయి. అంతే కాదు మనిషి రక్తం తియ్యగా పుల్లగా ఉంటే దోమలకు నచ్చదని ముందుగా ఒక మనిషిని కుట్టినప్పుడు రుచి చూసిన తర్వాతనే వారిపై ఎక్కువగా దాడి చేసి కుడుతూ ఉంటాయని తాజాగా పరిశోధకులు వెల్లడించారు.