Begin typing your search above and press return to search.

ఆ పింగాణీ పాత్ర కోట్ల రూపాయలు కురిపిస్తోంది!

By:  Tupaki Desk   |   26 Feb 2021 11:12 AM GMT
ఆ పింగాణీ పాత్ర కోట్ల రూపాయలు కురిపిస్తోంది!
X
ఒక చిన్న పింగాణీ పాత్ర కోట్ల రూపాయలు కురిపిస్తోంది. అనుకోకుండా కొన్న చిన్న గిన్నె ఒక వ్యక్తిని కోటిశ్వరుడిని చేసింది. ఓ రోజు మార్కెట్లో అతడికి నచ్చిన పింగాణి గిన్నెను ఓ వ్యక్తి రూ.2536 పెట్టి కొన్నాడు.

ఇది అరుదైన పాత్ర అనే అనుమానంతో వేలం పాట స్పెషలిస్టులకు వివరాలు పంపించాడు. వారు దీని ధర రూ.3.6 కోట్లకు పైగా ఉంటుందని చెప్పడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తన వివరాలు ఎవరికి చెప్పకూడదని వారిని కోరాడు.

అలా న్యూయార్క్ సౌత్ బే ఆక్షన్ వేలం పాటకు ఈ అత్యంత అరుదైన పింగాణీ పాత్ర ఎంపికైంది. దీన్ని మార్చిలో వేలం వేయనున్నారు.

2వేలకు కొన్ని పింగాణీ పాత్ర ఇప్పుడు మూడున్నర కోట్లు పలుకుతుండడం చూసి అతడి కష్టాలన్నీ పోయాయని తెగ సంబురపడుతున్నాడట..