రవిప్రకాష్ కొత్త మీడియా పార్టనర్ కం ఇన్వెస్టర్ అతడేనా?

Sat Sep 26 2020 22:00:26 GMT+0530 (IST)

Is He the new media partner cum investor Of Raviprakash?

తెలుగులో ఎలక్ట్రానిక్ మీడియాకు ఊపు తీసుకొని వచ్చి ఒక వెలుగు వెలిగిన వ్యక్తిగా టీవీ9 రవిప్రకాష్ ను మీడియా సర్కిల్స్ లో చెప్పుకుంటారు. అయితే రవిప్రకాష్ టీవీ9 నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 90శాతం ఆ చానెల్ లో పార్ట్ నర్స్ గా ఉన్న యజమానులు అతడి అవకతవకలపై ఫిర్యాదు చేయడంతో ఆ చానెల్ నుంచి రవిప్రకాష్ బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..కానీ ఇప్పటికీ రవిప్రకాష్ టాలెంట్ ఏంటో పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న వారికి అందరికీ తెలుసు. రవిప్రకాష్ కు రాజకీయ పార్టీలతో విపరీతంగా పరిచయాలు ఉన్నాయి. కొత్త చానెల్ ఒకటి రవిప్రకాష్ లాంచ్ చేస్తున్నాడని.. అందుకే ఒక్క పెద్ద టీంను తయారు చేస్తున్నాడని.. ప్రస్తుతం టీవీ9లో ఉన్న దాదాపు అందరూ రవిప్రకాష్ తో టచ్ లోకి వచ్చారని.. అతి త్వరలో రవిప్రకాష్ కొత్త చానెల్ మొదలు పెట్టబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ చానెల్ కు టీడీపీ యువ నాయకుడు లోకేష్ పెట్టుబడి పెడుతున్నాడని కూడా మీడియా సర్కిల్స్ సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది.

రవిప్రకాష్ కు.. లోకేష్ కు మధ్య వారధిగా లోకేష్ పీఏ అయిన ఒకప్పటి టీవీ9 యాంకర్ పనిచేస్తున్నాడని టాక్. ఇన్ని రోజులు చర్చలు జరిపారని.. అవి సఫలీకృతం అయ్యాయని.. ఇక కొత్త చానెల్ లాంఛ్ చేయడమే తరువాయి అని ప్రచారం సాగుతోంది.

అయితే కొత్త చానెల్స్ కు లైసెన్స్ వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి.. ఉన్న చానెల్ ఒకటి తీసుకొని పేరు మార్చి సెట్ చేయాలని కూడా అనుకుంటున్నట్టు భోగట్టా. జూబ్లిహిల్స్ లో ఆ చానెల్ కు అంతా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయ్యిందని మీడియా సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి చూద్దాం ఈ విషయం నిజమా? లేక ఒట్టి ప్రచారమా అన్నది ముందు ముందు తేలుతుంది.