Begin typing your search above and press return to search.

క్వారంటైన్ లో కలియుగ కుంభకర్ణుడు ..ఏంచేస్తున్నాడంటే !

By:  Tupaki Desk   |   29 May 2020 6:15 AM GMT
క్వారంటైన్ లో కలియుగ కుంభకర్ణుడు ..ఏంచేస్తున్నాడంటే !
X
వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా విజ్రంభిస్తుండటంతో అనుమానం వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్ కు తరలించి అక్కడ ప్రభుత్వమే వారి కోసం 14 రోజుల పాటు ఆహారాన్ని అందచేస్తుంది. ఇలా బీహార్ లోని ఒక క్వారంటైన్ సెంటర్ లో రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన 23 ఏళ్ళ యువకుడు రోజుకి 40 చపాతీలు 10 ప్లేట్ ల భోజనం అవలీలగా తినేయడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

అదేంటి ఒక మనిషి అంత ఎలా తింటాడు ? నిజమేనా అని అంటే ..నిజమే? అతగాడు.. ఉదయం టిఫిన్‌లో 40 చపాతీలు లాగించేస్తున్నాడు. సాధారణంగా 4 నుంచి 5 చపాతీలు తింటే ఎక్కువ. ఇక లాంచ్ అనుకో.. 10 ప్లేట్ల భోజనం తినంది అతని కడుపు నిండదు. అతడికి వండి పెట్టేందుకు సిబ్బంది కూడా అలసిపోతున్నారు. రాజస్థాన్ ‌కు చెందిన 23 ఏళ్ల అనూప్ ఓజా అనే వలస కూలీ.. బీహర్‌ వచ్చాడు. బాక్సర్ జిల్లాలో గల మంజ్వారీ క్వారంటైన్ కేంద్రంలో అతనిని ఉంచారు. అందరిలాగే ఉంటే ఫరావాలేదు. కానీ నలభీముడి లాగా తినడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. 10 మందికి అందజేసే భోజనం ఒక్కరే తింటున్నారని సిబ్బంది చెబుతున్నారు.

ఇటీవల లిట్టి 85 వరకు ఓజా లాగించేశాడు. దీంతో వంట చేసే సిబ్బంది నమ్మలేకపోయారు. అంతేకాదు అతను రోజు 40 చపాతీలు తినడంతో.. ఒకరి కోసం రోజుకు అన్నీ చేయలేము బాబోయ్ అంటూ వాపోతున్నారు. ఆ క్వారంటైన్ సెంటర్ లో పని చేసే కుక్ కూడా అతడు తినే చపాతీలతో తాను అలసిపోతున్నాని చెప్పడం గమనార్హం. కానీ అధికారులు మాత్రం క్వారంటైన్ సెంటర్ లో ఉన్నన్ని రోజులు అతడికి కావలసిన ఆహారం అందించవలసిందే అని ఆదేశాలిచ్చారు. అయితే, ఇతని తిండి గురించి ఎలా బయటకు పొక్కింది అంటే క్వారంటన్ కేంద్రంలోకి వస్తోన్న సరుకులు వెంటనే అయిపోతున్నాయి. దీంతో ఏం జరిగిందోనని ఆరాతీస్తే అసలు విషయం వెలుగుచూసింది.

ఇలా ఒక మనిషి ప్రతి రోజు ఇన్ని చపాతీలు భోజనం తినడం ఆశ్చర్యమే. మనం ఎక్కడో సినిమాలలో తప్ప బయట చూసి ఉండం. ఏదో ఒక రోజు పందెం పెట్టుకొని తినేవాళ్లను ఎక్కడో ఒక చోట చూసి ఉంటాం తప్ప రోజు ఇలా తింటుంటే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. మరో విషయం ఏమిటంటే ..అతడు బయట ఉన్నప్పుడు కూడా అలానే తినేవాడట.