Begin typing your search above and press return to search.

నేరం చేయకున్నా 43 ఏళ్లు జైల్లోనే .. బయటకి రాగానే ఏమైందంటే?

By:  Tupaki Desk   |   29 Nov 2021 6:37 AM GMT
నేరం చేయకున్నా 43 ఏళ్లు జైల్లోనే .. బయటకి రాగానే ఏమైందంటే?
X
సాధారణంగా కోర్టులు వందమంది దోషులు తప్పించుకున్నా కూడా ఒక్క నిర్దోషి కి కూడా శిక్ష పడకూడదు అని చెప్తాయి. అయితే ఓ వ్యక్తి తాను ఏ నేరం చేయకపోయినా కూడా ఏకంగా 43 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయాడు. చివరికి 62 ఏళ్ల వయస్సు లో నిర్దోషిగా గుర్తించి విడుదల చేసింది.

18 ఏళ్ల వయస్సులో. చివరకు 62 ఏళ్ల వయస్సున్నప్పుడు బయటకి వచ్చాడు. ఈ ఘటన చాలా మందిని కలిచివేసింది. అతడిని ఆదుకొనేందుకు చాలా మందుకు వచ్చారు. ఏకంగా రూ. 10 కోట్ల విరాళాలు వచ్చి చేరాయి. ఈ ఘటన వాషింగ్టన్ లో చోటు చేసుకుంది.

అతనే నేరం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. కానీ..అతను నేరం చేయలేదని ఆ మహిళ తెలుసుకుంది. కానీ, తప్పు చేసినట్లు ఒప్పుకొంటే శిక్ష విధిస్తుందోమోనన్న భయపడిపోయింది. ఫలితంగా అతడికి ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 43 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. కెవిన్ స్ట్రిక్ లాండ్ అనే వ్యక్తి, అమెరికాలోని మిసోరిలో నివాసం ఉంటున్నాడు.

1978 సంవత్సరం, ఏప్రిల్ 25వ తేదీన కాన్సాస్ నగరంలోని ఓ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. ఇంట్లో ఉన్న ముగ్గురిని కాల్చి చంపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడిలో సింతియా డగ్లస్ మహిళ తప్పించుకుంది. కాల్పులు జరిపిన వారిలో కెవిన్ కూడా ఉన్నాడని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కానీ, తాను పొరబడినట్లు సింతియా గ్రహించారు. కానీ, తప్పు ఒప్పుకుంటే, కోర్టు తనకు శిక్ష విధిస్తుందేమోనన్న భయంతో ఆమె పెదవి విప్పలేదు. ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు కెవిన్ కు 50 ఏళ్ల పాటు శిక్షను ఖరారు చేస్తూ, తీర్పును వెలువరించింది.

ఈ ఏడాది ఆగస్టులో కెవిన్ శిక్షను సవాల్ చేస్తూ, స్థానిక ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో కెవిన్ నిర్దోషి అని కోర్టు తేల్చింది. చివరకు కోర్టుకు సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత 2021, నవంబర్ 23వ తేదీన కెవిన్ జైలు నుంచి విడుదలయ్యారు. కానీ, అతని ఆరోగ్యం పూర్తిగా పాడైంది. దీంతో ఇతడిని ఆదుకోవడానికి గో ఫండ్ మీ సంస్థ రూ. 10 కోట్లు విరాళంగా సేకరించింది.