అమెరికాలో మరో తెలుగు మహిళకు కీలక పదవి

Thu Apr 22 2021 14:03:26 GMT+0530 (IST)

A key position for another Telugu woman in America

అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్న డెమొక్రాటిక్ నేత జో బైడెన్ బృందంలో పలువురు భారతీయ సంతతి వ్యక్తులకు కీలక పదవులు దక్కాయి.  ఇప్పటికే పదుల సంఖ్యలో భారతీయులు జో బైడెన్ సర్కారులో కొలువుదీరి ఉన్నారు. వీరిలో భారతీయ అమెరికన్ న్యాయవాది వనితా గుప్తా  అరుదైన ఘనత సాధించారు. అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా నియామకమయ్యారు. ఈ పదవి చేపట్టనున్న శ్వేతజాతియేతర తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా నియామకాన్ని ధ్రువీకరించేందుకు యూఎస్ సెనేట్ లో ఓటింగ్ నిర్వహించగా 51 ఓట్లు సాధించారు. వంద మంది సభ్యులున్న సెనేట్ లో రిపబ్లికన్ డెమొక్రాట్ పార్టీలకు చెరో 50 మంది సభ్యులున్నారు.దీనితో ఓటింగ్ లో టై అయితే ఓటు వేసేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం ఓటింగ్ కు హాజరయ్యారు. న్యాయవిభాగ నామినీగా వనితను అధ్యక్షుడు బైడెన్ వనితను ఎంపిక చేశారు. ఈ క్రమంలో స్పందించిన జో బైడెన్  వనితా గుప్తాకు అభినందనలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో న్యాయ శాఖలోని పౌర హక్కుల విభాగంలో వనితా గుప్తా పని చేశారు.  భారతదేశం నుంచి వలస వెళ్లిన ఆమె తల్లిదండ్రులు ఫిలడెల్ఫియా ప్రాంతంలో స్ధిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం ప్రారంభించిన వనితా గుప్తా యేల్ విశ్వవిద్యాలయం నుండి బాచిలర్స్ డిగ్రీని సాధించారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి ఆమె ప్రొఫెషనల్ లా డిగ్రీని పొందారు.  ఎన్‌ఏఏసీపీ లీగల్ డిఫెన్స్ ఫండ్‌లో వనితీ కెరీర్ ప్రారంభం కాగా.. ఆ తరవాత అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం బరాక్ ఒబామా హయాంలో న్యాయ శాఖలోని పౌర హక్కుల విభాగానికి నాయకత్వం వహించారు. ఫెర్గూసన్ మిస్సోరి ఇతర వర్గాల పట్ల పోలీసుల హింస అధికార దుర్వినియోగాలపై దర్యాప్తునకు నాయకత్వం వహించారు.