పెళ్లికి నో చెప్పిందనే ఓయో రూంకు తీసుకొచ్చి చంపేశాడట

Thu Oct 28 2021 12:10:46 GMT+0530 (IST)

A girl Murdered After saying no to the wedding

హైదరాబాద్ లోని చందానగర్ లోని ఒక ఓయో రూం లో స్టాఫ్ నర్సు నాగ చైతన్యను దారుణం గా ఆమె బాయ్ ఫ్రెండ్ చంపేయటం తెలిసిందే. ఈ మర్డర్ మిస్టరీ తాజాగా వీడిపోయింది. ప్రేమించుకున్నది నిజమే అయినా.. కోటి రెడ్డి తీరు సరిగా లేకపోవటం.. బాధ్యత మరిచి.. జులాయి గా తిరుగుతున్న అతడి తో జీవితాన్ని పంచుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని గ్రహించిన చైతన్య పెళ్లికి నో చెప్పటమే ఆమె ప్రాణాలు పోవటానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.పెళ్లి చేసుకుందామని కోటి రెడ్డి అడుగుతున్నా.. ఉద్యోగం లేక పోవటం.. బాధ్యత ను మరిచి తిరుగుతున్న అతడి కి దూరం గా ఉండాలని చైతన్య నిర్ణయించుకుంది. దీంతో.. ఆమె ను చంపేయాలని ప్లాన్ చేసిన కోటిరెడ్డి.. మాయ మాటలు చెప్పి.. ఒక్క సారి కలిసి మాట్లాడుకుందామని చెప్పటం తో ఆమె ఓయో రూంకు వచ్చినట్లు గా తెలుస్తోంది.

లాడ్జి లో రూం తీసుకున్న తర్వాత ఇరువురు ఒక రోజు ఉన్న తర్వాత.. రెండో రోజున పెళ్లి గురించి ప్రస్తావన రావటం.. తనకు ఇష్టం లేదని చెప్పటం తో పాటు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో.. చైతన్యను గొంతుకోసి చంపేసిన అతడు.. విచక్షణా రహితంగా ఆమె మీద కత్తి తో పలుచోట్ల దాడి కి పాల్పడటం చూస్తే.. ఎంత ఉన్మాదం గా వ్యవహరించాడో అర్థమవుతుందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం ఆత్మ హత్య డ్రామా ఆడి ఒంగోలు ఆసుపత్రి కి చేరిన అతడ్ని.. పోలీసులు తాజాగా అదుపు లోకి తీసుకొని విచారణ జరిపి.. రిమాండ్ కు తరలించారు. ప్రేమించినోడు సరైనోడు కాదన్నప్పుడు అతని తో వెళ్లాలన్న నిర్ణయమే నాగచైతన్య ప్రాణాలు పోవటానికి కారణమైందంటున్నారు.