మీరు చదువుతోంది నిజమే.. పంది పిల్లకు పాలు ఇచ్చిన ఆవు

Tue Aug 03 2021 21:00:01 GMT+0530 (IST)

A cow that gave milk to a piglet

మన చుట్టూ ఉండే సమాజంలో వింతలు.. విచిత్రాలకు కొదవ ఉండదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక వింత చోటు . అయితే.. ఇప్పటివరకు ఎప్పుడూ చోటు చేసుకోని కొన్ని అరుదైన ఘటనలు చోటు చేసుకోవటం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఇప్పుడు తెలుగు నేల మీద చోటు చేసుకుంది. ఏదైనా అనుకోని విపత్తు విరుచుకుపడినంతనే పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం గుర్తుకు వస్తుంటుంది.తాజాగా అలాంటి ఘటనే తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలోచోటు చేసుకుంది. ఒక ఆవు పందిపిల్లకు పాలు పట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జాతి వైరాన్ని పక్కన పెట్టి.. పాలు ఇవ్వటం చాలా అరుదైన ఉదంతంగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పట్టణ బస్టాండ్ లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది.

బస్టాండ్ ప్రాంగణలోని ఖాళీ స్థలంలో ఆవులు పెద్ద ఎత్తున విశ్రమిస్తుంటాయి. ఆకులు.. పేపర్లు..వ్యర్థాల్ని తింటూ అక్కడే తిరుగుతూ.. రాత్రిళ్లు అక్కడే నిద్రిస్తాయి. అదే ప్రాంతంలో పందులు కూడా తిరుగుతుంటాయి. కొన్నిసార్లు ఆవులు సేద తీరే చోటే.. పందులు కూడా విశ్రమిస్తూ ఉంటాయి. తాజాగా ఒక ఆవు నిద్ర పోతున్న వేళ.. పందులు కొన్ని దాని దగ్గరకు చేరాయి.

ఆ ఆవు పొదుగు చుట్టూ పంది పిల్లలు చేరి.. ఆవు పాలు తాగాయి. ఈ సందర్భంగా ఆవు కూడా ఏమీ అనకుండా ఉండిపోవటం విశేషం. ఈ విచిత్రాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే తమ చేతుల్లోని సెల్ ఫోన్లకు పని పెట్టారు.వీడియోలుగా తీసి.. తమ వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనే షేర్ చేశారు. దీంతో.. ఈ ఫోటోలు.. వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వింతను చూసి.. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.